October 21 Telugu News Updates: TRSలో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్-andhra pradesh and telangana telugu live news updates 21 october 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Andhra Pradesh And Telangana Telugu Live News Updates 21 October 2022

ఏపీ తెలంగాణ తాజా వార్తలు

October 21 Telugu News Updates: TRSలో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్

07:09 PM ISTB.S.Chandra
  • Share on Facebook
07:09 PM IST

ఏపీ, తెలంగాణ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉండండి..

Fri, 21 Oct 202201:40 PM IST

ఫలితాలు వచ్చేశాయ్… 

TSLPRB Results 2022: పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు ఫలితాలు, ఇతర వివరాల కోసం https://www.tslprb.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Fri, 21 Oct 202211:26 AM IST

టీఆర్ఎస్ లోకి దాసోజు, స్వామిగౌడ్….

శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్,  దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరారు.  మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరారు. 

Fri, 21 Oct 202209:59 AM IST

టీఆర్ఎస్ లోకి స్వామిగౌడ్…

బీజేపీకి స్వామిగౌడ్ రాజీనామా చేశారు. కాసేపట్లో టీఆర్ఎస్ లో చేరనున్నారు.

Fri, 21 Oct 202209:28 AM IST

కాగ్ కు ఫిర్యాదు… 

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాగ్ కు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఇటీవల సీబీఐకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ వెళ్లిన ఆమె.... కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై కాగ్ కు ఫిర్యాదు చేశారు.

ప్రాజెక్ట్ అంచనా లక్షా 20 వేల కోట్లకు పెంచారని షర్మిల ఆరోపించారు. ప్రాజెక్ట్ వ్యయం 3 ఇంతలకు పెంచారని పేర్కొన్నారు. ఆయకట్టు కేవలం రెండు లక్షల ఎకరాలు మాత్రమే పెరిగిందని... ప్రాజెక్ట్ ప్రతి దశలో భారీగా అవినీతి జరిగిందన్నారు. నాన్ ఎన్ ప్యానెల్ కంపెనీలకు కాంట్రాక్ట్ లు ఇచ్చారని ప్రస్తావించారు. BHEL నుంచి మోటర్లు కొన్న ధరకు ప్రభుత్వం చూపించిన ధరకు భారీగా వ్యత్యాసం ఉందని తెలిపారు.

Fri, 21 Oct 202209:23 AM IST

గుర్తింపు రద్దు…

బంజారాహిల్స్ స్కూల్ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. స్కూల్ గుర్తింపు రద్దు చేసేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చిన్నారి కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు.

Fri, 21 Oct 202208:57 AM IST

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్.. మునుగోడులో సెన్సేషన్

మునుగోడులో బీజేపీ అభ్యర్థి అయిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి‌కి ఓటు వేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఫోన్ కాల్ లీకై కలకలం సృష్టిస్తోంది. ఓ కాంగ్రెస్ లీడర్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియా‌లో వైరల్ అవుతోంది. ‘మనోడు దేనికైనా సాయం చేస్తడు. మనోడిని గెలిపించాలి. ఈ దెబ్బ‌తో నేను పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా.. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా.. పార్టీలను చూడొద్దు.. మనోడికి ఓటేయాలి.. ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా...’ అంటూ జబ్బార్ అనే నేతతో ఫోన్లో సంభాషించారు.

Fri, 21 Oct 202207:10 AM IST

పాదయాత్రపై హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని ఆదేశించింది. మద్దతిచ్చే వారంతా రోడ్డుకు ఇరువైపుల ఉండాలని హైకోర్టు ఆదేశించింది. మద్దతిచ్చే వారు పాదయాత్రలో కలిసి నడవకూడదని ఆదేశించారు.  పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చూడాలన్న హైకోర్టు సూచించింది. పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలని ప్రభుత్వ మధ్యంతర పిటిషన్ పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు.  ఎమ్మెల్యేలు, మంత్రుల రెచ్చగొట్టే ప్రకటనలపై దాఖలైన పిటిషన్లను కూడా కలిపి వింటామని  ఏపీ హైకోర్టు తెలిపింది. 

Fri, 21 Oct 202206:57 AM IST

తుల పాదయాత్రపై హైకోర్టులో విచారణ

అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. రైతుల పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాకలు చేసింది.  పాదయాత్రను కొనసాగించాలని ఉత్తరాంధ్ర రైతుల తరపున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. - పాదయాత్ర సాఫీగా సాగేందుకు తగిన సూచనలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి తరపు లాయర్ మురళీధర్ అఫిడవిట్ దాఖలు చేశారు.  అన్ని పక్షాల వాదనలను మధ్యాహ్నం ఒంటి గంటకు వింటామని హైకోర్టు తెలిపింది. 

Fri, 21 Oct 202206:55 AM IST

సునీతా రెడ్డికి న్యాయం చేయాలన్న షర్మిల

వైఎస్‌ వివేకానందరెడ్డి  హత్యపై  వైఎస్ షర్మిల స్పందించారు. తన కుటుబంలో జరిగిన ఘోరం ఇదని,  సునీతారెడ్డికి న్యాయం జరగాలన్నారు.  దోషులను కఠినంగా శిక్షించాలని,  దర్యాప్తును అడ్డుకోవడానికి వీల్లేదని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 

Fri, 21 Oct 202206:19 AM IST

జేపీ ఎవరు పిలిస్తే వచ్చాడు…..

జయప్రకాష్ నారాయణ అసెంబ్లీలో పిచ్చి మాటలు మాట్లాడితే టిఆర్‌ఎస్‌ వాళ్లు రెండు పీకితే ఇంట్లో కూర్చున్నాడని, రాజకీయాలు వదిలేశానని ప్రకటించిం ఇప్పుడు ఎవరు పిలిచారని మళ్లీ వచ్చారని  కొడాలి నాని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌ వాళ్లు ఎందుకు కొట్టారో, ఐఏఎస్‌ ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశాడో ఆయనకే క్లారిటీ లేదు. మైండ్ సరిగా పనిచేసి ఉంటే ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశారో, మిడిల్ డ్రాప్‌ ఎందుకయ్యాడో తెలియదని ఎద్దేవా చేశారు. 

Fri, 21 Oct 202206:06 AM IST

కలకలం రేపుతున్న విద్యార్థుల మిస్సింగ్

కడప జిల్లా బద్వేల్ లో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది.  వారం రోజుల్లోనే ముగ్గురు విద్యార్థుల అదృశ్యం అయ్యారు.  వారం క్రితం ఏడో తరగతి విద్యార్థిని సంజన మిస్సింగ్ కేసు నమోదైంది.  ఈ నెల 18న శ్రీనివాసులు అనే విద్యార్థి అదృశ్యం అయ్యాడు.  నిన్న మరాఠిపల్లెకు చెందిన అనూష అనే విద్యార్థిని మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. 

Fri, 21 Oct 202206:08 AM IST

వేదాంతపురంలో అగ్నిప్రమాదం

తిరుపతి శివారు వేదాంతపురంలో అగ్నిప్రమాదం జరిగింది.  వేదాంత పురంలోని బహుళ అంతస్తుల భవనంలో మంటలు  చెలరేగాయి. భవనంలో నిర్వహిస్తున్న వర్కింగ్ మెన్స్ హాస్టల్ లో మంటలు చెలరేగాయి.  హస్టల్ స్టోర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ తో చెలరేగాయి.  మంటల ధాటికి దుప్పట్లు, పరుపులు, మంచాలు తగులబడ్డాయి.  హాస్టల్ లో ఎవరూ లేకపోవడంతో  ప్రాణనష్టం తప్పింది. 

Fri, 21 Oct 202206:03 AM IST

ఉత్తరాఖండ్ లో ప్రధాని మోదీ పర్యటన

ఉత్తరాఖండ్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు.  కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆదిగురువు శంకరాచార్యుల సమాధి స్థలాన్ని సందర్శించారు. రూ.3,400 కోట్ల విలువైన కనెక్టివిటీ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.  రెండు కొత్త రోప్ వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.  గౌరీకుండ్ నుంచి కేదార్ నాథ్ వరకు 9.7 కి.మీ. మేర రోప్ వే నిర్మాణం చేపట్టనున్నారు.  మోదీ పర్యటన దృష్ట్యా కేదార్ నాథ్, బద్రీనాథ్ లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Fri, 21 Oct 202206:08 AM IST

ఆర్టీసీ బస్సులో మంటలు

కృష్ణా  జిల్లాలో ఆర్టీసీ బస్సుకు  ప్రమాదం తప్పింది.   ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో  అప్రమత్తమై  ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగి పోయారు.  పెదపారుపూడి మండలం పులవర్తిగూడెంలో ఘటన జరిగింది.  విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి.  ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 

Fri, 21 Oct 202206:08 AM IST

ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చిన జూడాలు

ప్రభుత్వానికి మళ్లీ సమ్మె నోటీసు ఇచ్చిన ఏపీ జూడాలు,  తక్షణం ఉపకార వేతనం పెంచాలని జూనియర్ వైద్యుల డిమాండ్ చేశారు. ఉపకార వేతనం 42 శాతం పెంచాలని కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చారు. సమ్మెలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల జూడాలు పాల్గొంటున్నారు.  ఈనెల 26న ఓపీ సేవలు, 27 నుంచి అత్యవసర సేవలు బహిష్కరిస్తామని ప్రకటించారు.  ఉపకార వేతనం పెంచాలని పూలు జతచేసి లేఖలు  పోస్టు చేశారు.