IRCTC Andaman Tour : అండమాన్ బీచ్ ల్లో సమ్మర్ ట్రిప్- 6 రోజుల ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ వివరాలివే!
IRCTC Andaman Tour : ఈ సమ్మర్ లో అండమాన్ దీవులను ఎక్స్ ప్లోర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఐఆర్సీటీసీ 6 రోజుల ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తుంది.
IRCTC Andaman Tour : ఈ సమ్మర్ బీచ్(Beach) లలో, వాటర్ స్పోర్ట్స్ , రెయిన్ ఫారెస్ట్ లో ఎంజాయ్ చేయాలనుకుటుంన్నారా? అయితే ఐఆర్సీటీసీ(IRCTC) చెన్నై (Chennai)నుంచి అండమాన్ ఐలాండ్స్ కు ఎయిర్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంచింది. హావెలాక్, నీల్, పోర్ట్ బ్లెయిర్ లో ఐదు రాత్రులు/ ఆరు రోజులు గడిపేయవచ్చు. ఈ టూర్ మే 20న ప్రారంభం కానుంది.
భారతదేశం ఈస్ట్ కోస్ట్ నుంచి 960 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అండమాన్ దీవులు(Andaman Islands). సుమారు 200 కంటే ఎక్కువ ద్వీవులు సమాహారమే అండమాన్. ఈ ద్వీపాల్లో పురాతన తెగలు ప్రజలు నివశిస్తున్నారు. అండమాన్ ప్రధాన పట్టణం పోర్ట్ బ్లెయిర్(Port Blair)..ఇక్కడ అందమైన రెయిన్ ఫారెస్టులు, స్పష్టమైన బీచ్‌లతో పాటు మోడ్రన్ రెస్టారెంట్లు ఉన్నాయి. అండమాన్ దీవుల్లోని రెయిన్‌ఫారెస్ట్(Rain Forests) డిస్కవరీ టూర్‌లు, స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్‌ను ఈ టూర్ లో ఎంజాయ్ చేయొచ్చు. స్నార్కెలింగ్, డైవింగ్ తో బోన్-వైట్ బీచ్‌లు, కోరల్ రీఫ్స్ ను ఎక్స్ ప్లోర్ చేయవచ్చు.
విమాన ప్రయాణ వివరాలు-
ఫ్లైట్ నెం. | బయలుదేరే తేదీ | నుంచి | బయలుదేరు సమయం | చేరుకునే తేదీ | వరకు | చేరుకునే సమయం |
6E-548 | 20.05.2024 | చెన్నై | 10.55 గంటలకు | 20.05.2024 | పోర్ట్ బ్లెయిర్ | 13.20 గంటలకు |
6E-2698 | 25.05.2024 | పోర్ట్ బ్లెయిర్ | 13.55 గంటలకు | 25.05.2024 | చెన్నై | 16.20 గంటలకు |
ఒక్కో వ్యక్తికి ధర-
క్లాస్ | సింగిల్ షేరింగ్ | డబుల్ షేరింగ్ | ట్రిపుల్ షేరింగ్ | చైల్డ్ విత్ బెడ్(5-11 years) | చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 Years) |
కంఫర్ట్ | రూ.63000 | రూ.47500 | రూ.45200 | రూ.39500 | రూ.36000 |
పర్యటన ప్రయాణం- చెన్నై-పోర్ట్ బ్లెయిర్-హేవ్‌లాక్ ఐలాండ్-నీల్ ఐలాండ్-పోర్ట్ బ్లెయిర్-చెన్నై
టూర్ వివరాలు
డే 1 : చెన్నై-పోర్ట్ బ్లెయిర్
చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్(Port Blair Airport) విమానాశ్రయానికి బయలుదేరతారు. అక్కడి నుంచి హోటల్ తీసుకెళ్తారు. తర్వాత పోర్ట్ బ్లెయిర్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత సుందరమైన, కొబ్బరి తోటలు ఉన్న బీచ్‌లలో ఒకటైన కార్బిన్స్ కోవ్ బీచ్, ఆ తర్వాత సెల్యులార్ జైలుకు తీసుకెళ్తారు. ఈ ప్రదేశం ఫ్రీడమ్ కోరుకునే వాళ్లకు చక్కని అనుభూతిని అందిస్తుంది. సెల్యులార్ జైలులో కదిలే లైట్ & సౌండ్ షోలో స్వాతంత్ర్య పోరాట చరిత్రను కూడా చూడవచ్చు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి బస చేస్తారు.
డే 2 : పోర్ట్ బ్లెయిర్
అల్పాహారం తర్వాత బ్రిటీష్ పాలనలో పోర్ట్ బ్లెయిర్ రాజధాని అయిన రాస్ ద్వీపాన్ని సందర్శిస్తారు. ఈ ద్వీపంలో ప్రస్తుతం చీఫ్ కమిషనర్ హౌస్, గవర్నమెంట్ హౌస్, చర్చి, బేకరీ, ప్రెస్, స్విమ్మింగ్ పూల్, స్మశానవాటిక మొదలైన పాత భవనాల శిథిలాలు ఉన్నాయి. తర్వాత నార్త్ బే ద్వీపాన్ని సందర్శించవచ్చు. వివిధ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీని ఆస్వాదించవచ్చు. సాయంత్రం షాపింగ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లోని హోటల్‌లో రాత్రి బస చేస్తారు.
డే 3 : పోర్ట్ బ్లెయిర్-హేవ్‌లాక్
తెల్లవారుజామున ప్యాక్ చేసుకుని అల్పాహారం చేసి హేవ్‌లాక్(Havelock) ద్వీపానికి ఫెర్రీ ద్వారా బయలుదేరతారు. పోర్ట్ బ్లెయిర్ నుంచి సముద్రం ద్వారా 54 కిమీలు/ 2 గంటల సమయం ప్రయాణించాలి. అక్కడి హోటల్‌కు చేరుకోగానే చెక్ ఇన్ చేస్తారు. తర్వాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాధా నగర్ బీచ్, కాలా పత్తర్ బీచ్‌లో టూర్ ఉంటుంది. హేవ్‌లాక్ ద్వీపంలోని సంబంధిత హోటల్ లేదా రిసార్ట్‌లో రాత్రి బస ఉంటుంది.
డే 4 : హేవ్‌లాక్-నీల్
బ్రేక్ ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి, ఎలిఫెంటా బీచ్‌కి సొంత ఖర్చుతో టూర్ ఉంటుంది. తర్వాత హేవ్‌లాక్‌కి తిరిగి వెళ్తారు. భోజనం తర్వాత ఫెర్రీ ద్వారా నీల్ ద్వీపానికి వెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్ చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత లక్ష్మణ్‌పూర్ బీచ్‌లో నాచురల్ బ్రిడ్జ్, సన్ సెట్ చూడవచ్చు. నైట్ రిసార్ట్‌లో స్టే చేస్తారు.
డే 5 : నీల్-పోర్ట్ బ్లెయిర్
బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత చెక్అవుట్ చేసి భరత్‌పూర్ బీచ్‌ని వెళ్తారు. భరత్‌పూర్ బీచ్ వాటర్ స్పోర్ట్స్ ప్రసిద్ధి. తర్వాత మధ్యాహ్నం పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరతారు. పోర్ట్ బ్లెయిర్‌లోని హోటల్‌లో రాత్రి బస చేస్తారు.
డే 6 -పోర్ట్ బ్లెయిర్-చెన్నై
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత చెన్నైకి తిరుగు ప్రయాణం అవ్వడానికి పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయంలో డ్రాప్ చేస్తారు. దీంతో పర్యటన ముగుస్తుంది.