వేసవి హీట్ నుంచి ఉపశమనం కోసం బెస్ట్ పానీయం లస్సీ. సమ్మర్ స్పెషల్ లస్సీలో ఏడు ప్రత్యేకమైన ఫ్లేవర్స్  మీ కోసం అందిస్తున్నాం 

pexels

By Bandaru Satyaprasad
Apr 20, 2024

Hindustan Times
Telugu

స్ట్రాబెర్రీ లస్సీ - స్వీట్ స్ట్రాబెర్రీలతో పెరుగు మిశ్రమమే ఈ లస్సీ. స్ట్రాబెర్రీలను కలపడం వల్ల వచ్చే రంగు అద్భుతంగా ఉంటుంది. దీనిని పింక్ కూలింగ్ డ్రింక్ అని అంటారు. రుచి కోసం చక్కెర,  బెల్లం, లేదా తేనె కలుపుకోవచ్చు.   

unsplash

రోజ్ లస్సీ- లస్సీ రుచులలో రోజ్ లస్సీ ఒక ప్రత్యేకమైంది.  క్రీమ్ పెరుగులో రోజ్ సిరప్ యాడ్ చేస్తారు. ఇది రిఫ్రెష్ అనుభూతిని అందిస్తుంది. 

unsplash

మసాలా లస్సీ- లస్సీలో జీలకర్ర, కొత్తిమీర, అల్లం వంటి మసాలా దినుసులను కలపడంతో అద్భుతమైన రుచి వస్తుంది. క్రీమ్ పెరుగులో సుగంధ ద్రవ్యాలు వేసి పుదీనా లేదా కొత్తిమీరతో అలంకరిస్తారు. ఈ మసాలా లస్సీ వేసవిలో రిఫ్రెష్‌గా ఉంటుంది. 

pexels

కుంకుమపువ్వు, ఏలకుల లస్సీ - ఇది మసాల లస్సీలా ఉంటుంది. కానీ సుగంధ ద్రవ్యాలు(Spices) చాలా తక్కువగా వేస్తారు. లస్సీని కుంకుమపువ్వు రంగు, ఏలకుల రుచి  అమోఘంగా మారుస్తుంది.  

pexels

చాక్లెట్ లస్సీ-క్రీమ్ పెరుగుతో రిచ్ చాక్లెట్‌ను మిక్స్ చేయడంతో వెల్వెట్ టెక్స్‌చర్, ఫ్లేవర్ వస్తుంది. కోకో పౌడర్, చాక్లెట్ సిరప్, పెరుగు, పాలు పదార్థాలు కలిపి లస్సీని మరింత రుచికరంగా మారుస్తుంది.   

unsplash

మింట్ లస్సీ- మింట్ లస్సీ క్లాసిక్ ఇండియన్ యోగర్ట్ పానీయానికి రిఫ్రెష్ ను జోడిస్తుంది. తాజా పుదీనా ఆకులు వేడి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ప్రతి సిప్‌తో చల్లటి రుచిని ఆస్వాదించవచ్చు.   

unsplash

అరటి వాల్నట్ లస్సీ- స్ట్రాబెర్రీ, మామిడి, అరటి పండుతో చేసే లస్సీ రిఫ్రెష్ ట్రీట్ అందిస్తుంది. వీటితో పాటు వాల్నట్‌లను కలపడంతో క్రంచీగా ఉంటుంది. రుచితో పాటు పోషకాలు లభిస్తాయి. 

pexels

రోజులో ఎంత టీ తాగొచ్చో చెప్పిన ఐసీఎంఆర్

Photo: Pexels