Ms Dhoni: నెక్స్ట్ ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌లో ధోనీ స్థానాన్ని భర్తీ చేసే వికెట్ కీపర్ వీళ్లలో ఎవరంటే?
Ms Dhoni: ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్ అయితే నెక్స్ట్ సీజన్‌లో సీఎస్‌కేలో అతడి స్థానాన్ని భర్తీ చేసే వికెట్ కీపర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తోన్న ముగ్గురు వికెట్ కీపర్లలో ఒకరు ధోనీ స్థానంలో సీఎస్‌కేలోకి రావచ్చునని అంటున్నారు.
రుతురాజ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు...
2024 సీజన్ ఆరంభం నుంచే ధోనీ తన రిటైర్‌మెంట్‌పై హింట్ ఇస్తూ వస్తోన్నాడు. ఈ సీజన్ ఆరంభానికి ముందే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు ధోనీ. కెప్టెన్సీ పదవిని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. ఈ సీజన్‌లో బ్యాటింగ్ కూడా పెద్దగా చేయడం లేదు ధోనీ. 2024 ఐపీఎల్‌లో సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడగా..అందులో ధోనీకి రెండు సార్లు మాత్రమే బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ రెండు మ్యాచుల్లో కలిపి 38 రన్స్ మాత్రమే చేశాడు ధోనీ. యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇస్తూ తాను మాత్రం ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. తనపై ఆధారపడకుండా ఇప్పటి నుంచే సీఎస్‌కేను నెక్స్ట్ సీజన్ కోసం ధోనీ రెడీ చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కెప్టెన్సీ బాధలేదు...
ధోనీ ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పడం పక్కా అని వార్తలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ సీజన్‌లో చెన్నైకి ధోనీ మెంటర్‌గా మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. ధోనీ రిటైర్ అయితే చెన్నైకి కెప్టెన్ సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. రుతురాజ్ కెప్టెన్సీలో ఈ సీజన్‌లో చెన్నై ఐదు మ్యాచుల్లో మూడు విజయాల్ని అందుకున్నది. అతడితో పాటు జడేజా, రహానే వంటి వారికి కెప్టెన్సీ అనుభవం ఉంది.
కెప్టెన్ సమస్య లేకపోయినా నెక్ట్ సీజన్‌లో ధోనీ స్థానాన్ని భర్తీ చేసే వికెట్ కీపర్ ఎవరన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.
ముగ్గురు పోటీ...
ధోనీకి తగ్గ వికెట్ కీపర్ కోసం సీఎస్‌కే ఇప్పటి నుంచే అన్వేషణ సాగిస్తోన్నట్లు సమాచారం. కీపింగ్‌తో పాటు బ్యాటింగ్ పరంగా జట్టుకు అండగా నిలిచే ఫినిషర్‌ను తీసుకోవాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ధోనీ స్థానంలో ధ్రువ్ జురేల్, ట్రిస్టన్ స్టబ్స్‌తో పాటు రాబిన్ మింజ్‌లలో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ధ్రువ్ జురేల్, స్టబ్స్...
ప్రస్తుతం ధ్రువ్ జురేల్ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇటీవలే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వికెట్ కీపర్ గత ఏడాది ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించాడు. గత సీజన్‌లో 152 పరుగులు చేసిన ధ్రువ్ జురేల్ రాజస్థాన్‌కు అద్భుతమైన విజయాల్ని అందించాడు. ట్రిస్టన్ స్టబ్స్ 2024 ఐపీఎల్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లో అదరగొడుతోన్నాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచుల్లో 63 యావరేజ్‌తో 189 రన్స్ చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ సీజన్‌లో టాప్ స్కోరర్స్‌లో ఒకటిగా స్టబ్స్ నిలిచే అవకాశం కనిపిస్తోంది.
రాబిన్ మింజ్ కూడా...
వీరిద్దరితో పాటు టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రాబిన్ మింజ్ కూడా ధోనీ స్లానాన్ని రీప్లేస్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశవాళీలో మెరుపులు మెరిపించిన ఈ వికెట్ కీపర్‌ను 2024 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 3.6 కోట్లకు కొన్నది. కానీ చివరి నిమిషంలో రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్‌కు రాబిన్ మింజ్ దూరమయ్యాడు. నెక్స్ట్ సీజన్ నుంచి బరిలో దిగనున్నాడు. 2025 ఐపీఎల్ వేలంలో ధ్రువ్ జురేల్, ట్రిస్టన్ స్టబ్స్‌తో పాటు రాబిన్ మింజ్‌లలో ఎవరో ఒకరిని సీఎస్‌కే కొనుగోలు చేయవచ్చని ప్రచారంజరుగుతోంది.