Bumrah Creates History: ఐపీఎల్లో బుమ్రా అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ అతడే-bumrah creates history in ipl 2024 became first bowler to take five wickets against rcb in ipl mi vs rcb ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bumrah Creates History: ఐపీఎల్లో బుమ్రా అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ అతడే

Bumrah Creates History: ఐపీఎల్లో బుమ్రా అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ అతడే

Apr 11, 2024, 10:12 PM IST Hari Prasad S
Apr 11, 2024, 10:12 PM , IST

  • Bumrah Creates History: ఐపీఎల్లో బుమ్రా ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ఆర్సీబీపై ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచాడు.

Bumrah Creates History: ఐపీఎల్లో ఆర్సీబీ జట్టుపై ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ గా ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా నిలిచాడు. ఆ టీమ్ తో గురువారం (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్ లో బుమ్రా 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఆర్సీబీపై ఇంతకుముందు ఛాంపియన్స్ లీగ్ లో షాన్ టెయిట్ 32 పరుగులకు 5 వికెట్లు తీసినా.. ఐపీఎల్లో మాత్రం గతంలో ఇది ఎవరికీ సాధ్యం కాలేదు.

(1 / 5)

Bumrah Creates History: ఇక ఐపీఎల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన ఘనతను కూడా బుమ్రా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో అతడు రెండోసారి ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు. గతంలో జేమ్స్ ఫాక్‌నర్, భువనేశ్వర్ కుమార్, జైదేవ్ ఉనద్కట్ కూడా ఈ ఘనత సాధించారు.

(2 / 5)

Bumrah Creates History: ఇక ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్ లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు ఒకటి కంటే ఎక్కువసార్లు తీసుకున్న రెండో బౌలర్ బుమ్రా. గతంలో లసిత్ మలింగ ఈ ఘనత సాధించాడు. అయితే అతడు ఓసారి ఐపీఎల్లో, మరోసారి ఛాంపియన్స్ లీగ్ లో ఈ ఘనత సాధించాడు.

(3 / 5)

Bumrah Creates History: ఆర్సీబీతో మ్యాచ్ లో విరాట్ కోహ్లితోపాటు డుప్లెస్సి, మహిపాల్ లోమ్రోర్, సౌరవ్ చౌహాన్, విజయ్ కుమార్ వైశాక్ వికెట్లు తీశాడు. అతడు 4 ఓవర్లలో ఏకంగా 13 డాట్ బాల్స్ వేశాడు.

(4 / 5)

Bumrah Creates History: ఇక ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖెడేలో ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్ బుమ్రా. గతంలో హర్భజన్ సింగ్ 2011లో చెన్నై సూపర్ కింగ్స్ పై 5 వికెట్లు తీశాడు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు