AP Politics : చంద్రబాబు - పీకే భేటీ… 'ఐప్యాక్' నుంచి కీలక ప్రకటన-ipac key announcement on collaboration with ysrcp party ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Politics : చంద్రబాబు - పీకే భేటీ… 'ఐప్యాక్' నుంచి కీలక ప్రకటన

AP Politics : చంద్రబాబు - పీకే భేటీ… 'ఐప్యాక్' నుంచి కీలక ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 24, 2023 08:27 AM IST

I-PAC Tweet On YSRCP :చంద్రబాబు-ప్రశాంత్ కిశోర్ భేటీ నేపథ్యంలో I-PAC టీమ్ కీలక ప్రకటన చేసింది. గతేడాది నుంచి తాము వైసీపీతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. మరోసారి జగన్ విక్టరీ కోసం కృషి చేస్తున్నట్లు ప్రకటించింది.

ఐ - ప్యాక్ కీలక ప్రకటన
ఐ - ప్యాక్ కీలక ప్రకటన

I-PAC News : ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు - ప్రశాంత్ కిశోర్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ నుంచి లోకేశ్ తో కలిసివచ్చిన పీకే… శనివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో మూడు గంటలకు పైగా చర్చించారు. అయితే వీరి భేటీలో ప్రధానంగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు కీలకఅంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో వైసీపీతో కలిసి పని చేసిన పీకే… అనూహ్యంగా టీడీపీ నేతలతో భేటీ కావటం హాట్ టాపిక్ గా మారింది.

ఐప్యాక్ కీలక ప్రకటన

ఇక చంద్రబాబు - ప్రశాంత్ కిశోర్ భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో… శనివారం రాత్రి ఐప్యాక్ టీమ్ ఓ ట్వీట్ చేసింది. గతేడాది నుంచి తాము వైసీపీతోనే కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించింది. 2024 ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ విజయం సాధించి దిశగా కృషి చేస్తామని తెలిపింది. ప్రజల జీవితాలను మెరుగుపరిచే దిశగా నిర్విరామంగా అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు ప్రకటించింది.

రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ద్వారా 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో అధికారం చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ఐప్యాక్ కు దూరంగా ఉంటున్నారు. చివరిగా ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ కోసం పనిచేశారు. ఈ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత కొంత కాలం బీఆర్ఎస్ కు పనిచేసినట్లు వార్తలు వచ్చినా... ఆ కాంబినేషన్ కుదరలేదు. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ ఏపీకి రావడం... చంద్రబాబుతో భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఐప్యాక్ లో పనిచేసి రిషి రాజ్ ప్రస్తుతం వైసీపీకి పనిచేస్తున్నారు.

ఇటీవల పలు టీవీ డిబెట్లలో ప్రశాంత్ కిషోర్… ఏపీ ప్రభుత్వ తీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలా అప్పులు చేసి పంచుకుంటూ పోతే దేశం దివాలా తీస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కోసం పనిచేసి గెలిపించినందుకు తనను ఇప్పుడు విమర్శిస్తున్నారని కూడా ఓ టీవీ డిబెట్ లో ఉన్నారు. కొన్నాళ్ల క్రితం జాతీయ మీడియాలో ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో ఈ వార్తలు ఫేక్ అని కొట్టిపడేశారు. ప్రస్తుతం పీకే, సీబీఎన్ భేటీతో ఈ వార్తలు నిజమేనన్న ప్రచారం మొదలైంది. టీడీపీతో కలిసి పని చేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. అయితే పీకే, చంద్రబాబు భేటీ వైసీపీ నేతలను షాక్ గురిచేసే విషయం అంటున్నారు విశ్లేషకులు. టీడీపీకి ప్రస్తుతం రాబిన్ శర్మ వ్యూహకర్తగా ఉన్నారు. రాజకీయ కార్యక్రమాలను ఆయనే ప్లాన్ చేస్తున్నారు. ఆయన కూడా గతంలో ఐ ప్యాక్ లో పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ టీడీపీతో కలిసి పనిచేస్తారా? లేక సలహాలు ఇస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఈ భేటీపై వైసీపీ నుంచి రియాక్షన్లు గట్టిగా వస్తున్నాయి. మేస్త్రీ మంచివాడే.. కానీ సరకు బాగాలేకపోతే ఏం చేస్తాడు అంటూ మంత్రి అంబటి సెటైర్ విసిరారు. ఇక గతంలో పీకే పై చంద్రబాబు, లోకేశ్ కామెంట్స్ తో పాటు వీడియోలను తెగ వైరల్ చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా సైన్యం. గతంలో బిహారీ దొంగ అంటూ మాట్లాడిన టీటీడీ నేతలు… ఇప్పుడెలా పీకేను తెచ్చుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పీకే - చంద్రబాబు భేటీతో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారిందని చెప్పొచ్చు.

Whats_app_banner