Pithapuram YCP MLA: వైసీపీని వీడేందుకు సిద్ధమైన పిఠాపురం ఎమ్మెల్యే…?
Pithapuram YCP MLA: వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. పిఠాపురంలో అభ్యర్ధి మార్పు ఖాయమని తేలడంతో పార్టీని వీడేందుకు ఎమ్మెల్యే సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.
Pithapuram YCP MLA: పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. నియోజక వర్గంలో పోటీ చేసేందుకు మరోసారి అవకాశం ఇచ్చే అవకాశాలు లేవని తేలిపోవడంతో పార్టీని వీడాలని దొరబాబు నిర్ణయించుకున్నారు. పార్టీలో ఇన్‌ఛార్జిగా మరొకరిని ప్రకటించిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే తన అనుచరులకు దొరబాబు స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత రానుంది. దొరబాబుకు మళ్లీ టిక్కెట్ కేటాయించే అవకాశాలు లేని ఇప్పటికే తేల్చి చెప్పడంతో ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు.
పిఠాపురంలో అభ్యర్థి మార్పు సమాచారం ఇవ్వడానికి నాలుగు రోజుల క్రితం దొరబాబును సిఎంను పిలిపించారు. పిఠాపురం నుంచి వంగా గీతను పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది.
దొరబాబు 2004లో బీజేపీ నుంచి గెలిచారు. వైసీపీలో టిక్కెట్ రాదని తేలిపోయిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని అనుచరులతో దొరబాబు స్పష్టం చేశారు. వైసీపీ నాయకత్వం వద్దనుకుంటే మనం చేయాల్సింది మనం చేద్దామని అనుచరులకు క్లారిటీ ఇచ్చారు. జనసేన తరపున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు.
కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం విషయంలో కూడా హామీ లేకపోవడంతో దొరబాబు తన దారి తాను చూసుకోవాలని భావిస్తున్నారు. పిఠాపురం నుంచి వైసీపీ టిక్కెట్ ఇవ్వకపోతే జనసేన నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నాయకులతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దొరబాబు ఓడిపోయారు. 2004లో బీజేపీ తరపున పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచారు. ఈ సారి జనసేన తరపున పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.