Election Code : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.... ఇకపై తిరుమలలో ఆ లేఖలను స్వీకరించరు-in view on the election code no recommendation letters for srivari darshan and accommodation in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Election Code : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.... ఇకపై తిరుమలలో ఆ లేఖలను స్వీకరించరు

Election Code : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.... ఇకపై తిరుమలలో ఆ లేఖలను స్వీకరించరు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 17, 2024 12:05 PM IST

Election Code in Andhrapradesh 2024 : ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో… టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి సిఫార్సులు లేఖలు అనుమతించబడవని స్పష్టం చేసింది.

తిరుమల
తిరుమల

Election Code in Andhrapradesh : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. మార్చి 16వ తేదీన భారత ఎన్నికల సంఘం…. ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. ఏపీలోని 175 స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాలకు ఒకే విడుతలో ఎన్నికలు(AP Elections 2024) జరగనున్నాయి. మే 13వ తేదీన పోలింగ్ జరగనుండగా… జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈసీ ప్రకటన నేపథ్యంలో…. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది.

టీటీడీ కీలక ప్రకటన

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి తిరుమలలో వసతితో పాటు స్వామి వారి దర్శనానికి సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులతో పాటు వారి కుటుంబ స‌భ్యుల‌కు నిర్దేశించిన విధివిధానాల మేర‌కు ద‌ర్శ‌నం, వ‌స‌తి క‌ల్పిస్తామని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ పూర్త‌య్యేవ‌ర‌కు ఏ రకమైన వ‌స‌తి, దర్శనాలకు కూడా సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాల్గో విడతలో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ రానుంది. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన(ఏప్రిల్ 26వ తేదీ) ఉంటుంది. మే 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడుతలో పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

  • ఎన్నికల నోటిఫికేషన్- ఏప్రిల్ 18
  • నామినేషన్లు స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 25
  • నామినేషన్లు ఉపసంహరణ-ఏప్రిల్ 29
  • నామినేషన్ పరిశీలన -ఏప్రిల్ 26
  • ఎన్నికల పోలింగ్ తేదీ- మే 13
  • కౌంటింగ్ తేదీ- జూన్ 4

కేంద్ర ఎన్నికల సంఘం(Elections Commission) ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలింగ్ మే 13 (AP Polling Day)తేదీన జరుగుతుందన్నారు. నోటిఫికేషన్ ఏప్రిల్ 18 తేదీన విడుదల అవుతుందన్నారు. నేటికి రాష్ట్రంలో 4.09 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం 4.07 కోట్ల మంది ఉన్నారన్నారు. కొత్తగా ఈ నెలన్నర రోజుల్లో 1.75 లక్షల మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారన్నారు. 

ఎన్నికల షెడ్యూల్ (AP Election Schedule)ప్రకటన రాక ముందు నుంచే రాష్ట్రంలోకి వచ్చే రహదారుల్లో చెక్ పోస్టులు పెట్టామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇప్పటి వరకూ 164 కోట్ల విలువైన నగదు, వస్తువులు, డ్రగ్స్, మద్యం సీజ్ చేశామన్నారు. ఉచితాలు, నగదు తరలింపు కోసం అన్ని కేంద్ర ,రాష్ట్ర ఏజెన్సీలతో నిఘా పెట్టామని తెలిపారు. హెలికాప్టర్లు, విమానాల ద్వారా తరలించేందుకు అవకాశం లేకుండా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈసారి ఎన్నికలకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసారి బందోబస్తు కోసం 1,14,950 మంది సివిల్ పోలీసులు, 58 కంపెనీల పారామిలటరీ బలగాలు, 465 కంపెనీల సాయుధ బలగాలు అవసరం అవుతున్నారని చెప్పారు. ఏపీకి 2 లక్షల ఈవీఎం(EVMs) యంత్రాలను ఈసీఐ కేటాయించిందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

 

IPL_Entry_Point