SCR : తిరుపతి, నర్సాపూర్, హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు.. టైమింగ్స్ ఇవే
South Central Railway Special Trains : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని ప్రాంతాలకు.. నడిపే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టుగా తెలిపింది.
దక్షిణ మధ్య పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు ట్రైన్ల వివరాలను తెలిపింది. రైలు నెంబర్.. 07648 తిరుపతి-నర్సాపూర్ స్పెషల్ ట్రైన్ ను సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో నడపనున్నట్లు తెపింది. చెప్పిన తేదీల్లో సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 04.30 గంటలకు గమ్యానికి చేరుతాయి. తిరుపతి-నర్సాపూర్ ట్రైన్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, విరవసరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది.
రైలు నంబర్ 07649 నర్సాపూర్-హైదరాబాద్ మధ్య సెప్టెంబర్ 8, 15, 22, 29 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ ఆయా రోజుల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 08.40 గంటలకు గమ్యానికి చేరుతుంది. పాలకొల్లు, విరవసరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మరియు సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.
మరికొన్ని ప్రత్యేక రైళ్లు
తాజాగా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో కాచిగూడ, తిరుపతి, నాగర్ సోల్, యశ్వంతపూర్ ల నుంచి నడపనున్నాయి. కాచిగూడ నుంచి తిరుపతికి ఈ నెల 26న స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 22.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.00 గంటలకు గమ్యానికి చేరుతుంది. తిరుపతి-కాచిగూడ ప్రత్యేక ట్రెన్ ఈ నెల 27న నడపనున్నారు. ఈ ట్రైన్ 15.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 03:45 గంటలకు గమ్యానికి చేరుతుంది. ఈ స్పెషల్ ట్రైన్లు షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
కాచిగూడ-నాగర్ సోల్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 28న ప్రకటించారు. ఈ ట్రైన్ రాత్రి 08.20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08.35 గంటలకు గమ్యానికి చేరుతుంది. నాగర్ సోల్ -కాచిగూడ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 29న ప్రకటించారు. ఈ ట్రైన్ 22.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09.45 గంటలకు గమ్యానికి చేరుతుంది. ఈ ట్రైన్లు మల్కాజ్ గిరి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణ, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.
నాందేడ్- యశ్వంతపూర స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 30న ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 13.35 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.30 గంటలకు గమ్యానికి చేరుతుంది. యశ్వంతపూర్-నాందేడ్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 31న ప్రకటించారు. ఈ ట్రైన్ 17.20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 15.30 గంటలకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రత్యేక రైళ్లు ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, అనంతపూర్, ధర్మవరం, పెనుగొండ, హిందూపూర్, యల్హంక స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు.
సంబంధిత కథనం