Deputy CM Mutyala Naidu : దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు
Deputy chief minister Budi Mutyala Naidu: చంద్రబాబుపై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు. చంద్రబాబు అతిపెద్ద అవినీతికి పాల్పడ్డారని… దేశంలోనే ఆయన అత్యంత అవినీతిపరుడని విమర్శించారు.
Deputy chief minister Budi Mutyala Naidu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయినా ఆ బాధ వారి కుటుంబ సభ్యుల్లో కనిపించడంలేదని వ్యాఖ్యానించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన…. స్కిల్ స్కాం కేసులో అన్ని ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయారని అన్నారు. చంద్రబాబు అతిపెద్ద అవినీతికి పాల్పడ్డారని… చంద్రబాబు జైలులో బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్ చేస్తారని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే జైలు నుంచి రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారని ప్రశ్నించారు. నారా ఫ్యామిలీ, నందమూరి కుటుంబం కలిసి ఎన్ని యాత్రలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరన్నారు.
చంద్రబాబు ఏ తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు కదా? అని ముత్యాల నాయుడు ప్రశ్నించారు రూ.371 కోట్ల అవినీతిలో చంద్రబాబు అడ్డంగా దొరికొపోయారు కాబట్టే జైలు జీవితం గడుపుతున్నారని తెలిపారు. స్కిల్ స్కాంలో బయటపడింది కేవలం గోరంత మాత్రమే అని… చంద్రబాబు అవినీతి పూర్తి స్థాయిలో వెలికి తీస్తే కొండంత అవినీతి బయటపడుతుందన్నారు.