AP Inter Exams: మార్చి 1 నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు.. హాల్ టిక్కెట్లు విడుదల.. ఏర్పాట్లపై బొత్స సమీక్ష
AP Inter Exams: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్ధులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స అధికారులకు సూచించారు. ఇంటర్ హాల్ టిక్కెట్ల Hall Tickets పంపిణీని మంత్రి బొత్స ప్రారంభించారు.
AP Inter Exams: ఇంటర్మీడియట్ పరీక్షల్ని పకడ్బందీగా లు నిర్వహించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదన్నారు. ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియెట్, టెట్, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ మంత్రి సమీక్షReview నిర్వహించారు.
పరీక్షా కేంద్రాలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలని బొత్స ఆదేశించారు. పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఇతర విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ Conference నిర్వహించారు.
రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల నిర్వహణకు అధికారులంతా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
1 మార్చి, 2024న జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాల్ టికెట్ల పంపిణీని Distribution మంత్రి బొత్స ప్రారంభించారు. గతేడాది ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేలా ప్రోత్సహించిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని బొత్స అభినందించారు.
మార్చి నెల అంతా పరీక్షల కాలం అని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది వివిధ పరీక్షలకు హాజరవుతున్నారని మంత్రి వివరించారు. గత రెండేళ్లుగా పూర్తి కట్టుదిట్టమైన చర్యలతో పరీక్షలను నిర్వహించినట్లే, ఈసారి కూడా పరీక్షలను నిర్వహించాలన్నారు.
అధికారులంతా పరీక్షా కేంద్రాల్లోని ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి మరోసారి అన్నీ సక్రమంగా ఉన్నట్లుగా నిర్దారించుకోవాలని సూచించారు. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులందరమూ పూర్తి సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలన్నారు.
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ పరీక్షలకు 1559 పరీక్షా కేంద్రాల్లో 10,52,221మంది విద్యార్థులు హాజరవుతారని, గత ఏడాదితో పోలిస్తే 47,921 మంది అధికంగా పరీక్షలకు హాజరవుతున్నారన్నారని చెప్పారు.
పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయాలని, జెరాక్స్ షాపులు తెరవకూడదన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఫోన్లు అనుమతి లేదని, సిబ్బంది ఎవరి వద్ద ఫోన్లు ఉండకూడదని ఆదేశించారు.
అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరీక్షా కేంద్రాలకు అవసరమైన సౌకర్యాలు తెలియ జేయాలని కోరారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మంచి నీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు, ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.
ఈ ఏడాది మార్చి1న జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యా సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఈ ఏడాది అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రైవేట్ సంస్థలకు దీటుగా మౌలిక వసతుల పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభించామని పేర్కొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన బెంచ్ లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, త్రాగునీటి వసతి, టాయిలెట్లు మరియు ఇతర మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిని చూసి ప్రైవేట్ జూనియర్ కాలేజీల నుంచి పరీక్షలకు వచ్చే విద్యార్థులు ఆశ్చర్యపోతారన్నారు.
పరీక్షలకు హాజరవుతున్న 10,52,221 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులలో గతేడాది పరీక్షలలో ఉత్తీర్ణులు కాని 93,875 మంది విద్యార్థులు మళ్లీ ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలకు హాజరయ్యేలా గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ప్రోత్సహించారని తెలిపారు.