AP 10th Inter Exams : ఏపీ పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల- మంత్రి బొత్స ప్రకటన
AP 10th Inter Exams : ఏపీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో మార్చి 31వ తేదీ లోపు పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపరు.
మంత్రి బొత్స సత్యనారాయణ
AP 10th Inter Exams : వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మార్చి 31లోపే పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు, థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. మార్చి 18 తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స వెల్లడించారు. ఇంటర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్
- మార్చి 18- ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
- మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 20- ఇంగ్లీష్
- మార్చి 22- మ్యాథమెటిక్స్,
- మార్చి 23- ఫిజికల్ సైన్స్
- మార్చి 26 - బయాలజీ
- మార్చి 27-సోషల్ స్టడీస్
- మార్చి 28- మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ఎస్ఈ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1
- మార్చి 30-ఓఎస్ఎస్ఈ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 ( సంస్కృతం, అరబిక్, పర్షియన్), వొకేషనల్ కోర్సుల పరీక్ష
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల తేదీలు(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు)
- మార్చి 1 - PART-II సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
- మార్చి 4- PART-I ఇంగ్లీష్ పేపర్ -I
- మార్చి 6 -మ్యాథమెటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్ - 1 , సివిక్స్ పేపర్ - 1
- మార్చి 9 - మ్యాథమెటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ - 1, హిస్టరీ పేపర్ - 1
- మార్చి 12- ఫిజిక్స్ పేపర్ - 1, ఎకనామిక్స్ - 1
- మార్చి 14 - కెమిస్ట్రీ పేపర్ - I, కామర్స్ పేపర్ - 1, సోషియాలజీ పేపర్ - 1, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ -1
- మార్చి 16 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - I, లాజిక్ పేపర్ -1 , బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ - 1
- మార్చి 19- మెడ్రన్ లాంగ్వేజ్ పేపర్- I, జాగ్రఫీ పేపర్- 1
ఇంటర్ సెకండియర్ పరీక్షల తేదీలు(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు)
- మార్చి 2- PART-II సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
- మార్చి 5 -PART-I ఇంగ్లీష్ పేపర్-II
- మార్చి 7- మ్యాథమెటిక్స్ పేపర్ పేపర్ - IIA, బోటనీ పేపర్ -II, సివిక్స్ పేపర్- II
- మార్చి 11 - మ్యాథమెటిక్స్ పేపర్ - IIB, జువాలజీ పేపర్ పేపర్ -II, హిస్టరీ - II
- మార్చి 13 - ఫిజిక్స్ పేపర్- II, ఎకనామిక్స్ - II
- మార్చి 15 - కెమిస్ట్రీ పేపర్ - II, కామర్స్ పేపర్ - II, సోషియాలజీ పేపర్- II, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ -II
- మార్చి 18 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - II, లాజిక్ పేపర్ -II , బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ - II
- మార్చి 20 - మెడ్రన్ లాంగ్వేజ్ పేపర్- II, జాగ్రఫీ పేపర్-II