Annamayya Accident : అన్నమయ్య జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు యువకులు స్పాట్ డెడ్
Annamayya Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు వ్యక్తులు స్పాట్ లోనే మరణించారు. కారును టిప్పర్ ఢీకొట్టారు.
Annamayya Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు స్పాట్‌డెడ్ అయ్యారు. మృతులంతా కడపకు చెందిన వారు. యువకులు చనిపోవడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని కొండవాండ్లపల్లె వద్ద చోటు చేసుకుంది. అటుగా వస్తున్న టిప్పర్ కొండవాండ్లపల్లె వద్ద రాయచోటికి వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఐదుగురు ఉన్నారు. నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన క్షతగ్రాతున్ని చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన మృతులంతా కడపకు చెందివారే. మరణించివారు షేక్ అఫ్రోజ్ (30), జితేంద్ర (22), అంజి నాయక్ (29), షేక్ అలీమ్ (32)గా గుర్తించారు. సమాచారం అందుకున్న రామాపురం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు జిల్లాలో రోడ్డుపై ఎగిరిపడిన తల
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మొండెం తలవేరయ్యాయి. రోడ్డు రక్తంతో నిండిపోయింది. రక్తపుమడుగులో ఉన్న మృతదేహం వద్దకు స్థానికులు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ డీజీపీ కార్యాలయం సమీపంలో వడ్డేశ్వరం బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక వ్యక్తిపై లారీ దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు విజయవాడ పుష్ప హోటల్ సెంటర్ వాసిగా గుర్తించినట్లు తెలిసింది. చూసిన ప్రత్యక్ష సాక్షులు సమాచారం ప్రకారం రోడ్డుపై ఆత్మహత్య చేసుకోవడానికి బోర్లా పడుకున్నాడని తెలిసింది. వచ్చేలారీ డ్రైవర్ ఎంత కంట్రోల్ చేసుకున్న ఆగకపోవడంతో అతనిపైకి వెళ్లంది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అంతేకాకుండా తల, మొండెం వేరు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్టు బస్సు బోల్తా పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులిద్దరూ సత్యసాయి జిల్లాకు చెందిన వారు. టూరిస్టు బస్సు బోల్తాపడిన ఘటన చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాణి మండలం బసవరాజు కండ్రిగ వద్ద జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు టూరిస్టులు మృతి చెందారు. మరో పదిమందికి గాయాలు అయ్యాయి. అనంతపురం నుంచి తమిళనాడుకు వెళ్తున్న టూరిస్టు బస్సు పెద్దపంజాణి మండలం బసవరాజు కండ్రిగ వద్దకు వచ్చే సరికి అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో మరణించి వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయాలు అయిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి పెద్దపంజాణి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం