తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Putin Military Recruitment : పుతిన్​ వల్ల దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న రష్యన్లు!

Putin military recruitment : పుతిన్​ వల్ల దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న రష్యన్లు!

25 September 2022, 20:40 IST

Putin military recruitment : ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో సైన్యాన్ని బలపరిచేందుకు పౌరుల నుంచి కూడా రిక్రూట్​మెంట్​ చేపట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్​ నిర్ణయించారు. 3లక్షల మందిని నియమించుకునేందుకు ప్రణాళికలు రచించారు. ఈ వార్త.. రష్యన్ల గుండెల్లో గుబులురేపింది. ఆలస్యం చేయకుండా.. రష్యన్లు ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. పుతిన్​ ప్రకటన అనంతరం వందలాది మంది టర్కీకి వెళ్లిపోయారు. మాస్కో నుంచి టర్కీకి అందుబాటులో ఉన్న విమానాల టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఫిన్​లాండ్​, జార్జియా, ఖజకిస్థాన్​లోకూ రష్యన్ల తాకిడి పెరుగుతోందని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.