తెలుగు న్యూస్  /  Telangana  /  Will The Problems Of Podu Lands Be Solved In The Wake Of Cm Kcr's Latest Announcement In Assembly

Podu Lands in Telangana: ఇకనైనా ‘పోడు’ గోడు తీరేనా..?

HT Telugu Desk HT Telugu

11 February 2023, 11:00 IST

    • Podu Lands Issue in Telangana: పోడు భూముల అంశంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖారులోనే పట్టాల పంపిణీ ఉంటుందని చెప్పేశారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన కొన్ని కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో పోడు భూముల అంశానికి పరిష్కారం దొరుకుతుందా..? లేక మళ్లీ గతంలో మాదిరిగానే అలాగే ఉంటుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.
పోడు భూముల వివాదం
పోడు భూముల వివాదం

పోడు భూముల వివాదం

Telangana Podu Lands Issue: పోడు భూములు... గత కొంత కాలంగా తెలంగాణలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. ఏదో ఒక చోట అధికారులు, గిరిజనుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇదీ కాస్త... ఈ మధ్య ఓ అధికారిని అత్యంత దారుణంగా హత్య చేసే అంతవరకు కూడా వెళ్లింది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో పోడు భూముల అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీగా గిరిజనులు పోడు చేసుకుంటున్నారు. వీరికి పట్టాల అందజేత విషయంలో కూడా ప్రభుత్వం గతంలో కూడా ప్రకటనలు చేసింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖారులోనే పట్టాలను పంపిణీ చేస్తామని ఓ అడుగు ముందుకేశారు. ఈ నేపథ్యంలో పోడు భూముల అంశానికి పరిష్కారం దొరికినట్లేనా..? లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉంటుంది..? కటాఫ్ ఎక్కడి వరకు పెడ్తారు..? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Samshabad Leopard: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌‌ బోనులో చిక్కిన చిరుత, వారం రోజులుగా ముప్పతిప్పలు పెట్టిన చిరుత

Karimnagar landgrabbers: కరీంనగర్‌ భూకబ్జాదారులపై ఉక్కుపాదం, పోలీసు కస్టడీకి 9మంది నిందితులు

తెలంగాణ(Telangana)లోని సుమారు 11 జిల్లాల్లో పోడు భూములు అధికంగా ఉన్నాయి. మిగతా జిల్లాల్లోనూ పోడు వ్యవసాయం(Podu Cultivation) చేస్తున్న వారు ఉన్నారు. కొన్నేళ్లుగా గిరిజన రైతులు సాగు చేకుకుంటున్నారు. హరితహారం పథకంతో అటవీ భూముల్లో ప్రభుత్వం మెుక్కల పెంపకం చేపడుతోంది. దీంతో అటవీ(Forest) అధికారులు, పోడు వ్యవసాయం చేసే రైతులకు మధ్య వివాదం నడుస్తోంది. భూ హక్కు ప త్రాలు ఉన్న భూములను వదిలేసి.. మిగతా ప్రాంతాల్లో మెుక్కలు నాటుతామని అధికారులు చెబుతున్నారు. తాము పోడు చేసుకుంటున్న భూముల్లో మెుక్కలు నాటుతున్నారని గిరిజనులు అంటున్నారు. రాష్ట్రంలో 28 జిల్లాల నుంచి రెండు వేల 845 గ్రామ పంచాయతీల నుంచి 4 లక్షల 14వేల 353 దరఖాస్తుల వరకూ ప్రభుత్వానికి వచ్చాయి. ఆ భూమి చూసుకుంటే.. 12లక్షల 46వేల 846 ఎకరాలుగా ఉంది. ఆ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కసరత్తు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... 11 లక్షల ఎకరాలకుపైగా పట్టాలిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అడవులను నరకవద్దని… పోడు వ్యవసాయ విషయంలో రాతపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అలా చేయకపోతే పట్టాలు పంపిణీ చేయమని స్పష్టం చేశారు.

హామీ ఇవ్వాల్సిందేనా..?

రాజకీయ పక్షాలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు కూడా రాతపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనిపై సమగ్రంగా చర్చించి.. లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ముందుకు వెళ్లబోతుందనేది ఆసక్తికరంగా మారింది. స్థానికంగా ప్రజాప్రతినిధులు రాతపూర్వక హామీలు ఇస్తారా..? ప్రభుత్వం చెబుతున్న నిబంధనలకు గిరిజనులు ఓకే అంటారా..? అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో అక్రమంగా కొందరు గిరిజనుల భూములను కొట్టేసి పోడు చేస్తున్నారు. ఇతర కులాల వారు గిరిజనుల అమ్మాయిలను వివాహం చేసుకొని కూడా పోడు భూములను ఆక్రమించారు. ఈ విషయాన్ని కూడా సీఎం తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అంశంపై కూడా ప్రభుత్వం ఓ విధానంతో ముందుకెళ్లే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమించిన భూముల విషయంలో కూడా ప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా చూడాలి.

మరోవైపు పోడు భూముల విషయంలో కేసీఆర్ చేసిన ప్రకటనపై రాజకీయ పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 2014, 2018 ఎన్నికల వేళ… గిరిజనులకు హామీ ఇచ్చిన కేసీఆర్… ఇప్పటి వరకు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నిస్తున్నారు. తీరా మరోసారి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోడు భూముల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని… పైగా రాతపూర్వక హామీలు అంటూ కొత్త విషయాలను ప్రస్తావిస్తున్నారంటూ విమర్శించారు. పారదర్శకంగా ప్రక్రియను చేపట్టాలని… అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలని, కటాఫ్ విషయంలో సరైన విధానం పాటించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్పష్టమైన విధానంతో పరిష్కారిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన వేళ… ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా..? చెబుతున్నట్లే 11 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తుందా..? లేక సమస్య మళ్లీ మొదటికే వస్తుందా..? అనేది చూడాలి.