తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Rape Case: ఆర్నేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం.. అన్నదమ్ములు అరెస్ట్

Warangal Rape Case: ఆర్నేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం.. అన్నదమ్ములు అరెస్ట్

HT Telugu Desk HT Telugu

06 January 2023, 7:47 IST

  • Warangal Crime News: వరంగల్ నగరంలో దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై  గత ఆర్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.  

మైనర్ బాలికపై రేప్
మైనర్ బాలికపై రేప్

మైనర్ బాలికపై రేప్

Minor girl raped in Warangal: వారిద్దరూ వరుసకు అన్నదమ్ములు...! పక్కింటి బాలికపై కన్నేశారు..! పదో తరగతి చదువుతున్న ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యారు. ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా గత ఆరు నెలలుగా వారి కోరికలను తీర్చుకుంటున్నారు. వీడియోలు రికార్డులు చేసి భయపెట్టారు. తీరా విషయం కాస్త బాలిక తల్లికి తెలియటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన వరంగల్ నగరంలో వెలుగు చూసింది.

ఏం జరిగిందంటే...

వరంగల్ నగరంలోని ఓ కాలనీలో పదిహేనేళ్ల బాలికపై తల్లితో కలిసి నివాసం ఉంటోంది. అదే ప్రాంతంలో అలీ(26), అబ్బు (22) ఉంటున్నారు. వీరిద్దరూ వరుసకు అన్నదమ్ములు అవుతారు. ఈ బాలిపై కన్నేసిన వీరు.. మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్నారు. ఎవరూ లేని సమయంలో ఒకరికి తెలియకుండా మరొకరు ఇంటికి పిలిపించి పలుమార్లు రేప్ చేశారు. ఈ టైంలో నగ్న చిత్రాలు, వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బాలికను బెదిరించేవారు. బాలికకు నిందితులు పలుమార్లు సైగలు చేయడం గమనించిన తల్లి మందలించడంతో బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వెంటనే బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల ఇంటిపై బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బీజేపీ నాయకులు దాడి చేశారు. ఇంటి ఎదుట నిలిపిన వాహనాలను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.

ఈ ఘటనపై వరంగల్ నగర సీపీ ఏవీ రంగనాథ్ మాట్లాడారు. బుధవారం అర్ధరాత్రి ఫిర్యాదు అందిందని చెప్పారు. మైనల్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని వెల్లడించారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఐపీసీ తో పాటు పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.