తెలుగు న్యూస్  /  Telangana  /  Tslprb Key Decision On Who Disqualified In Height Police Recruitment Events

TSLPRB Alert: పోలీసు బోర్డు కీలక నిర్ణయం..ఆ అభ్యర్థులకు మళ్లీ ఈవెంట్స్

HT Telugu Desk HT Telugu

08 February 2023, 20:00 IST

    • TSLPRB Latest Updates: పోలీస్ ఉద్యోగాల నియామకంపై  రిక్రూట్ మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 1 సెం.మీ లేదా అంతకన్నా తక్కువ కలిగి ఉన్నారన్న కారణంతో డిస్ క్వాలిఫై అయిన వారికి ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్
పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్

పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్

TSPLRB Latest News: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే ప్రిలిమ్స్ ఫలితాలు రాగా.. వెంటనే ఈవెంట్స్ కూడా పూర్తి చేసింది రిక్రూట్ మెంట్ బోర్డు. మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ఖరారు చేసింది. కొద్దిరోజుల కిందట అభ్యర్థులకు ఏడు మార్కులు కలపాలని కూడా బోర్డు నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు…1 సెం.మీ లేదా అంతకన్నా తక్కువ కలిగి ఉన్నారన్న కారణంతో డిస్ క్వాలిఫై అయిన వారికి మళ్లీ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది

ట్రెండింగ్ వార్తలు

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Samshabad Leopard: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌‌ బోనులో చిక్కిన చిరుత, వారం రోజులుగా ముప్పతిప్పలు పెట్టిన చిరుత

Karimnagar landgrabbers: కరీంనగర్‌ భూకబ్జాదారులపై ఉక్కుపాదం, పోలీసు కస్టడీకి 9మంది నిందితులు

ఈ నెల 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్ లోని అంబర్ పేట పోలీస్ గ్రౌండ్స్, కొండాపూర్ 8వ బెటాలియన్లో ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు వివరించింది.

ఇదిలా ఉంటే ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షలో మల్టిపుల్‌ ప్రశ్న విషయంలో అందరికీ మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేస్తోంది బోర్డు. ఇప్పటికే అర్హత పొందిన అభ్యర్థులు పార్ట్ 2 కంప్లీట్ చేశారు.వీరు ఫిబ్రవరి 8 ఉదయం 8గం నుంచి 12వ తేది రాత్రి 10గం వరకూ దేహదారుఢ్య పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు వివరించింది. ఫిబ్రవరి 15 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగానే… మళ్లీ ఎత్తు విషయంలో నిర్ణయం తీసుకోవటంతో మరికొంత మంది కూడా మెయిన్స్ కు అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఇలా అర్హత ఇవ్వటంపై ఇప్పటికే పాస్ అయినవారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పోటీని మరింత పెంచుతున్నారంటూ విమర్శిస్తున్నారు.