తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy : బీజేపీ బాధ్యతలు గవర్నర్ చూసుకోవాలంటే కష్టం

Revanth Reddy : బీజేపీ బాధ్యతలు గవర్నర్ చూసుకోవాలంటే కష్టం

HT Telugu Desk HT Telugu

09 November 2022, 23:09 IST

    • Revanth Reddy Comments : ప్రభుత్వం పరిపాలన నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను గౌరవించాలని రేవంత్​రెడ్డి అన్నారు. అనుమానాలను నివృత్తి చేసుకుని బిల్లులను ఆమోదింపజేసుకొని, ప్రజలకు పరిపాలన అందించాలని సూచించారు.
రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

గవర్నర్ పై రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి మరల్చేందుకు టీఆర్ఎస్(TRS), బీజేపీ(BJP) కలిసి బిల్లుల ఆమోదంపై రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్​రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. గవర్నర్‌ సైతం ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ బాధ్యతలు గవర్నర్ నిర్వహించాలనుకుంటే కష్టమని పేర్కొన్నారు. బండి సంజయ్(Bandi Sanjay), కిషన్​రెడ్డి పాత్ర గవర్నర్ తమిళిసై పోషించాలనుకోవడం సమజసం కాదని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Rains : హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్, విద్యుత్ కు అంతరాయం- సహాయ చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Mlc Kavitha : ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారు, నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు- ఎమ్మెల్సీ కవిత

Karimnagar : కరీంనగర్ లో గాలి వాన బీభత్సం, సీఎం రేవంత్ రెడ్డి టూర్ రద్దు

Khammam Accident : ఖమ్మంలో విషాదం- రేపు బర్త్ డే, రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

'రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను, సంస్థలను గౌరవించాలి. అనుమానాలను నివృత్తి చేసుకొని బిల్లులను ఆమోదింపజేసుకొని ప్రజలకు పరిపాలన అందించాలి. వీరిద్దరి వ్యవహారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా గవర్నర్(Governor)కు వచ్చిన నష్టం లేదు కేసీఆర్​కు వచ్చిన కష్టం లేదు. చిల్లర రాజకీయాలు బీజేపీ, టీఆర్ఎస్ మానుకోవాలి.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) ప్రతి విషయాన్ని పారదర్శకంగా చూడాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన నిర్వహించడానికి అవసరమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని, సంస్థలను గౌరవించాలన్నారు.

రాహుల్ గాంధీ జోడో యాత్ర(Rahul Gandhi Jodo Yatra)పై రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)లో రాహుల్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నారన్నారు. చారిత్రక కట్టడం చార్మినార్ మీదుగా యాత్ర అద్భుతంగా సాగిందన్నారు. రాచరిక విధానాలపై పోరాటం చేయడానికి రాహుల్ కదిలారన్నారు. దేశంలో సమస్యలపై కొట్లాడాలని ఆలోచనతో రాహుల్ ముందుకు కదిలారని పేర్కొన్నారు. కాగడాల ప్రదర్శనతో కాంతి రేఖలు నింపుతూ మహారాష్ట్ర గడ్డపై జోడో యాత్ర అడుగు పెట్టిందన్నారు.

ఇంకా రేవంత్ ఏం చెప్పారంటే..

పీసీసీ అధ్యక్షుడిగా నా బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తించాను. ప్రజల్లో భరోసాను నింపేందుకు, జోడో యాత్ర(Jodo Yatra) స్పూర్తితో మళ్లీ ప్రజల ముందుకు వస్తాం. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ(Congress Party) విస్పష్టమైన కార్యచరణతో ప్రజల్లోకి వెళుతుంది. టీఆరెస్, బీజేపీ వైఖరిని ప్రజలకు వివరించేందుకు ఒక కార్యచరణతో ముందుకొస్తాం మునుగోడులో టీఆరెస్ ది సాంకేతిక విజయం మాత్రమే. తెలంగాణలో టీఆర్ఎస్ గెలవదని కేసీఆర్ స్వయంగా ఒప్పుకుని కమ్యూనిస్టుల సహకారం తీసుకున్నారు. టీఆరెస్ పార్టీ పరాన్న జీవిగా మారింది. పరాయి వ్యక్తులపై, శక్తులపై ఆధారపడి టీఆర్ఎస్ గెలిచింది.

మునుగోడు(Munugode)లో బీజేపీ బరితెగించింది. వందల కోట్లు పంచిపెట్టి దేశంలోనే మునుగొడును తాగుబోతు నియోజకవర్గంగా నిలబెట్టారు. 20 రోజుల్లో 300 కోట్ల రూపాయల మందును తాగించారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రజలను తాగుబోతులుగా మార్చాయంటే అక్కడి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. చుక్క మందు పోయకుండా కాంగ్రెస్ 24వేల ఓట్లు పొందిందని గర్వంగా ఉంది. కాంగ్రెస్ ను మూడో స్థానానికి నెట్టడానికి చాలా మంది బీజేపీ నాయకులు తిష్ట వేశారు. దేశానికి నాయకుడవుతానన్న కేసీఆర్ సొంత కాళ్లపై నిలబడలేకపోయారు.

మునుగోడు ఫలితాల(Munugode Result)పై నేను సంతృప్తిగా ఉన్నా. మా కార్యకర్తల పోరాట పటిమను నేను అభినందిస్తున్నా. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిది కాదు. ఏఐసీసీ ఆదేశాల ప్రకారం టీపీసీసీ ముందుకు వెళుతుంది. సమస్యలను పక్కదారి పట్టించేందుకే గవర్నర్ తో టీఆర్ఎస్ పంచాయితీ పెట్టుకుంటోంది. గవర్నర్ సందేహలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రతీది గవర్నర్ రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు.