LIVE UPDATES
TG ICET Spot Admissions : ఈ నెల 15, 16 టీజీ ఐసెట్ స్పాట్ అడ్మిషన్లు, అవసరమయ్యే సర్టిఫికెట్లు ఇవే
Telangana News Live October 8, 2024: TG ICET Spot Admissions : ఈ నెల 15, 16 టీజీ ఐసెట్ స్పాట్ అడ్మిషన్లు, అవసరమయ్యే సర్టిఫికెట్లు ఇవే
08 October 2024, 21:50 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Telangana News Live: TG ICET Spot Admissions : ఈ నెల 15, 16 టీజీ ఐసెట్ స్పాట్ అడ్మిషన్లు, అవసరమయ్యే సర్టిఫికెట్లు ఇవే
- TG ICET Spot Admissions : తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. రేపు స్పాట్ అడ్మిషన్ల పై నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఆయా కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ సీట్ల సీట్ల వివరాలను ఇప్పటికే వెబ్ సైట్ లో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
Telangana News Live: Dy CM Bhatti :దసరాలోపే ఫీజు రీయంబర్స్‌మెంట్,స్కాలర్ షిప్ బకాయిలు విడుదల-త్వరలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్: భట్టి విక్కమార్క
- Dy CM Bhatti Vikramarka : విద్యుత్ శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే దసరా కంటే ముందు ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్, పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామని తెలిపారు.
Telangana News Live: Flight Services : హైదరాబాద్ - కడప మధ్య విమాన సర్వీసులు పునః ప్రారంభం.. కీలక ప్రకటన చేసిన ఇండిగో
- Flight Services : హైదరాబాద్- కడప మధ్య విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కడప ఎయిర్‌పోర్ట్ ప్రకటన విడుదల చేసింది. అటు ఈ సర్వీసును మళ్లీ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఇండిగో ప్రకటించింది. ఈ సర్వీసు పునరుద్ధరణ పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Telangana News Live: Fake Bank Officers : బ్యాంకు అధికారుల్లా చెలామణి, తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని రైతులకు టోకరా
- Fake Bank Officers : బ్యాంకు అధికారులుగా చెలామణి అవుతూ.. రైతులు, వ్యాపారస్తులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడిన ఏడుగురిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. లోన్లు ఇప్పిస్తామని రైతులు, వ్యాపారస్తుల నుంచి రూ.26 లక్షలు వసూలు చేశారు.
Telangana News Live: Nagarjuna Family At Court : కుటుంబంతో సహా కోర్టుకు వచ్చి హీరో నాగార్జున, వాంగ్మూలం ఇదే
- Nagarjuna Family At Court : మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. ఇవాళ హీరో నాగార్జున స్వయంగా హాజరై కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చారు. తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి ఆయన కోర్టుకు వచ్చారు.
Telangana News Live: TG Gulf Workers : గల్ఫ్ బాధితులకు తెలంగాణ సర్కార్ అండ, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
- TG Gulf Workers Compensation : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, మార్గదర్శకాలు ప్రకటించింది.
Telangana News Live: Hyderabad : ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో 8 ముఖ్యాంశాలు
- Hyderabad : భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అక్టోబర్ 3న ఆయనకు నోటీసులు ఇవ్వగా.. మంగళవారం ఆయన అధికారుల ఎదుట హాజరయ్యారు. తనపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపించారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తానని అజారుద్దీన్ స్పష్టం చేశారు.
Telangana News Live: Karimnagar Politics: కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ
- Karimnagar Politics: రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవడం లేదా?... కరీంనగర్ జిల్లాలో ఆయనకు చెక్ పెట్టే కుట్ర జరుగుతుందా?.. అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఔననే సమాధానం వస్తుంది.
Telangana News Live: TG Wildlife Crime : ఆన్‌లైన్‌లో అమ్మకానికి అంతరించిపోతున్న జంతువులు! ఈ దందా గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు
- TG Wildlife Crime : తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అడవులు ఎక్కువ. ఈ అడవుల్లో అంతరించిపోతున్న జాతులకు చెందిన జంతువులు ఉన్నాయి. వాటిని వేటాడి.. కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో రాజకీయ నాయకులు ఉండటం గమనార్హం.
Telangana News Live: Sangareddy : సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
- Sangareddy : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. పొలం పనులకు వెళ్లి.. ఇంటికి తిరిగొస్తున్న వారిని కర్ణాటక ఆర్టీసీ బస్సు బలిగొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. బస్సు బలంగా ఢీ కొట్టడంతో.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
Telangana News Live: Karimnagar Politics: మహాశక్తి ఆలయంలో అమ్మవారి సన్నిధిలో కలిసిన రాజకీయ ప్రత్యర్థులు..
- Karimnagar Politics: కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. ముగ్గురు అమ్మలు కొలువైన మహాశక్తి ఆలయంలో మూడు ప్రధాన పార్టీల ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రత్యర్థులు కలిశారు. అమ్మవారు సమక్షంలో కరచాలం చేసుకుని ముచ్చటించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు... శాశ్వత శత్రువులు ఉండరని నిరూపించారు.