హైదరాబాద్- కడప మధ్య విమాన రాకపోకలు పునః ప్రారంభం కానున్నాయి.ఈ విషయాన్ని కడప ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ ఇండిగో సర్వీసులు నడుస్తాయని స్పష్టం చేశారు. ఈ రూట్‌లో సర్వీసులు మళ్లీ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఇండిగో సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 27 నుంచి ఈ రూట్‌లో సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
6ఈ 7096 విమానం అక్టోబర్ 27వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు కడప చేరుకోనుంది. ప్రతీరోజు ఇదే సమయానికి ఫ్లైట్ అందుబాటులో ఉండనుంది.
6ఈ 7097 విమానం అక్టోబర్ 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాలకు కడపలో బయలుదేరుతుంది. సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ సర్వీసు కూడా ప్రతిరోజూ అందుబాటులో ఉండనుంది.
'ఇండిగో కొత్త మార్గాలను అనుసంధానించడానికి నిరంతరం కృషి చేస్తుంది. వాటిలో ఒకటి హైదరాబాద్ నుండి కడప. ప్రస్తుతం.. ఇండిగో హైదరాబాద్ నుండి కడప విమానాలతో సహా 74 దేశీయ గమ్యస్థానాలకు సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్ నుండి కడప, అలాగే కడప నుండి హైదరాబాద్ విమానాల టికెట్లను నేరుగా వెబ్‌సైట్ లేదా ఇండిగో మొబైల్ యాప్ నుండి బుక్ చేసుకోవచ్చు' ఇండిగో ప్రకటించింది.
కడప-హైదరాబాద్ : ప్రతిరోజు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
కడప- విజయవాడ- కడప : సోమ, బుధ, శుక్ర, ఆదివారం
చెన్నై-కడప-చెన్నై : సోమ, బుధ, శుక్ర, ఆదివారం
బెంగళూరు- కడప-బెంగళూరు: మంగళ, గురు, శనివారం
కడప- విశాఖపట్నం -కడప : మంగళ, గురు, శనివారం