LIVE UPDATES
Police Families Protest : సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన పోలీస్ కుటుంబాలు - ఎందుకంటే..?
Telangana News Live October 24, 2024: Police Families Protest : సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన పోలీస్ కుటుంబాలు - ఎందుకంటే..?
24 October 2024, 21:19 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
తెలంగాణ News Live: Police Families Protest : సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన పోలీస్ కుటుంబాలు - ఎందుకంటే..?
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కుటుంబాలు ఆందోళనకు దిగాయి. అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. డ్యూటీ పేరిట తమ వాళ్లను కూలీ పనులు, చెత్త ఏరడం, మట్టి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ News Live: Sangareddy District : గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్ - 25 జీవాలు మృతి
- గొర్రెల మందపైకి దూసుకెళ్లిన ఘటనలో 25 మూగ జీవాలు మృతి చెందాయి. మరికొన్ని గాయాలపాలయ్యాయి. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా పరిధిలోని నాందేడ్ జాతీయ రహదారిపై జరిగింది. టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు… వాహనాన్ని స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ News Live: TG Govt Employees : ఉద్యోగుల DAలపై సర్కార్ ఫోకస్, రేపటిలోపు క్లారిటీ..! 51 డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ
- టీజీవో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో… ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. పెండింగ్ డీఏలపై రేపటిలోపు కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తెలంగాణ News Live: Singareni Diwali bonus : సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. రూ.358 కోట్ల బోనస్
- Singareni Diwali bonus : సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. బోనస్ కింద రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
తెలంగాణ News Live: TG Govt Jobs 2024 : తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో ఉద్యోగాలు - వచ్చే నెల 11 వరకు దరఖాస్తుల స్వీకరణ, ముఖ్య వివరాలివే
- TG Medical Council Recruitment 2024: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. జూనియర్ అసిస్టెంట్, విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన వారు నవంబర్ 11లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో మాత్రమే స్వీకరిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ News Live: MLC Jeevan Reddy : పార్టీ ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీరియస్ కామెంట్స్
- పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గంపగుత్తగా 10 మంది ఎమ్మెల్యేలను వేరే పార్టీలో నుండి తీసుకొని ప్రభుత్వాన్ని నడపాలా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ News Live: Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుప్పుమంటున్న గంజాయి.. 17 క్వింటాళ్లు స్వాధీనం
- Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. రోజురోజుకూ గంజాయి కేసులు పెరుగుతున్నాయి. కిలోల కొద్ది గంజాయి పట్టుబడుతోంది. ఇప్పటి వరకు పోలీసుల దాడుల్లో 17 క్వింటాళ్ల గంజాయి దొరికింది. దీంతో మిషన్ పరివర్తన్ ద్వారా అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
తెలంగాణ News Live: Jani Master Bail : జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- Jani Master Bail : జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన జానీమాస్టర్.. రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీపై కేసు నమోదు అయ్యింది.
తెలంగాణ News Live: Kamareddy Police : పోలీస్ స్టేషన్‌లో చిల్డ్రన్ ప్లేయింగ్ జోన్.. కామారెడ్డి పోలీసులు అందరికీ ఆదర్శం!
- Kamareddy Police : కామారెడ్డి పోలీసులు.. ఇతర జిల్లాల అధికారులకు ఆదర్శింగా నిలుస్తున్నారు. వినూత్న ఆలోచనలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. చిన్నారులను ప్రోత్సహించడమే కాకుండా.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లో ప్లేయింగ్ జోన్ ఏర్పాటు చేశారు. ఠాణాను పచ్చదనంతో నింపేశారు.
తెలంగాణ News Live: TGSRTC : ఆర్టీసీలో అద్దె వాహనాలే సగం.. డొక్కు బస్సులతో సిబ్బందికి ఇబ్బందులు!
- TGSRTC : తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది.. డొక్కు బస్సులతో ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు పాతవి కావడం, నిర్వహణ సరిగా లేకపోవడంతో.. ఎక్కడపడితే అక్కడే ఆగిపోతున్నాయి. ఫలితంగా అటు ప్రయాణికులు, ఇటు సిబ్బంది తిప్పలు పడుతున్నారు. కొత్త బస్సులు సమకూర్చాలని కోరుతున్నారు.
తెలంగాణ News Live: Warangal Police : కాపాడేవారే కాటేస్తున్నారు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాదిలోనే పోలీసులపై 5 కేసులు!
- Warangal Police : ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందు గుర్తొచ్చేది పోలీస్. అలాంటి పోలీసులే ఇప్పుడు పెద్ద సమస్య అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ ఇన్స్‌పెక్టర్‌పై పొక్సో కేసు నమోదు అయ్యింది. గతంలోనూ పోలీసులపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి.
తెలంగాణ News Live: Special Trains : ప్రయాణికులకు గమనిక.. దీపావళి సందర్భంగా అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే
- Special Trains : దీపావళి పండగ నేపథ్యంలో.. రైళ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. దీంతో ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి పలు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నారు. ఈ రైళ్ల సేవలను వినియోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు.
తెలంగాణ News Live: Nalgonda Cement Factory: నల్గొండలో అదానీ మంటలు.. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఎందుకీ రచ్చ
- Nalgonda Cement Factory: వందల కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పాని నిర్ణయం జరిగిన ఒక పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది! నిరుద్యోగ సమస్యను కొంతైనా తగ్గించ వచ్చు. తమ పిల్లకు ఉద్యోగాలు వస్తాయి, తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిసి కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.
తెలంగాణ News Live: Elderly Woman: అందరూ ఉన్నా ఒంటరి బతుకు భరించలేక..చిక్కడపల్లిలో 98ఏళ్ల వృద్ధురాలి ఆత్మహత్య
- Elderly Woman: హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఆత్మహత్య అందరిని కలిచి వేసింది. ఐదుగురు పిల్లలు ఉన్నా ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది.కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ News Live: Facebook Love: కరీంనగర్ జిల్లాలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఫెస్ బుక్ ప్రేమాయణం
- Facebook Love: కరీంనగర్ జిల్లాలో ఫేస్ బుక్ ప్రేమాయణం ఠాణా మెట్లెక్కింది. చేట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇద్దరు ఒకరిపై మరొకరు పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.