Elderly Woman: అందరూ ఉన్నా ఒంటరి బతుకు భరించలేక..చిక్కడపల్లిలో 98ఏళ్ల వృద్ధురాలి ఆత్మహత్య-a 98 year old woman committed suicide in chikkadapally as she couldnt bear to live alone ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Elderly Woman: అందరూ ఉన్నా ఒంటరి బతుకు భరించలేక..చిక్కడపల్లిలో 98ఏళ్ల వృద్ధురాలి ఆత్మహత్య

Elderly Woman: అందరూ ఉన్నా ఒంటరి బతుకు భరించలేక..చిక్కడపల్లిలో 98ఏళ్ల వృద్ధురాలి ఆత్మహత్య

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 24, 2024 07:54 AM IST

Elderly Woman: హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఆత్మహత్య అందరిని కలిచి వేసింది. ఐదుగురు పిల్లలు ఉన్నా ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు సూసైడ్ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది.కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

96ఏళ్ల వృద్ధురాలి ఆత్మహత్య
96ఏళ్ల వృద్ధురాలి ఆత్మహత్య

Elderly Woman: వృద్ధాప్యం,ఒంటరితనం.. మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా జీవించాల్సిన చరమాంకంలో ఓ వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడటం హైదరాబాద్‌లో కలకలం రేపింది. జీవితంపై విరక్తి చెందిన వృద్ధురాలు చీరకు నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అశోక్ నగర్ పరిధిలోని సిద్ధంశెట్టి అపార్ట్మెంట్‌లో సరోజినీదేవి అనే 96ఏళ్ళ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది.

వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సరోజినీ దేవి పిల్లలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఒంటికి నిప్పం టించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ డివిజన్‌లో ఉన్న సిద్ధంశెట్టి అపార్ట్మెంట్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

జవహర్ నగర్ సిద్దంశెట్టి అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులోని ఫ్లాట్ లో సరోజనిదేవి అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. భర్త చనిపోయిన తర్వాత ఆమె ఒక్కరే ఫ్లాట్‌లో ఉంటున్నారు. సమీపంలో మరో అపార్ట్మెంట్‌లో నివసించే కుమారుడు రవిచంద్ర సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

ప్రతి రోజు ఉదయం, సాయంత్రం టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించే వాడు. సరోజని బుధ వారం ఉదయం ఇంట్లోనే చీరకు నిప్పంటించుకుంది. ఫ్లాట్ నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు డయల్‌ 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచాం అందించారు. వృద్ధురాలు ఫ్లాట్‌ లోపలి నుంచి గడియ పెట్టుకోవడంతో తలుపులు పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే శరీరమంతా కాలిపోయి వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది.

మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి.. కుమారుడు రవిచంద్ర ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్ద కుమారుడు ప్రసాద్ అమెరికాలో స్థిరపడినట్టు సమాచారం ఇచ్చారు. సరోజని దేవి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన చావుకు ఎవరు బాధ్యులు కారని, పిల్లలకు భారం కాకూడదనే చనిపోతున్నట్లు మృతురాలు సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.

సరోజిని దేవి భర్త గతంలోనే చనిపోవడంతో అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తోంది. సరోజినీ దేవి దంపతులకు ఇద్దరు కుమారులు. ముగ్గురు కుమార్తెలున్నారు. వారంద రికీ వివాహాలయ్యాయి. పెద్ద కుమా రుడు ప్రసాద్ అమెరికాలో ఉండగా.. చిన్న కుమారుడు రవి తల్లికి సమీపంలోనే మరో అపార్ట్మెంట్‌లో తన కుటుంబసభ్యులతో నివసిస్తున్నట్టు పోలీసులకు తెలిపాడు.

సరోజిని దేవి వృద్ధాప్యం కారణంగా నడవలేని స్థితికి చేరింది. ఇంటి పనులు చేయడానికి కేర్‌టేకర్‌ను నియమించుకుంది. రెండు మూడు రోజులుగా కేర్‌ టేకర్‌ కూాడ విధులకు రావడం లేదు. బుధవారం ఉదయం ఇంట్లో నుంచి పొగలు రాడంతో ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. సీఐ బానోత్ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Whats_app_banner