LIVE UPDATES
Telangana Weather : 3 జిల్లాలకు ఆరెంజ్.. 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వణికిపోతున్న తెలంగాణ
Telangana News Live November 25, 2024: Telangana Weather : 3 జిల్లాలకు ఆరెంజ్.. 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వణికిపోతున్న తెలంగాణ
25 November 2024, 12:44 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
తెలంగాణ News Live: Telangana Weather : 3 జిల్లాలకు ఆరెంజ్.. 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వణికిపోతున్న తెలంగాణ
- Telangana Weather : తెలంగాణను చలి వణికిస్తోంది. ఉదయం 8 లోపు, సాయంత్ర 6 తర్వాత బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. చాలా చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో మూడు పరిస్థితులు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణ News Live: SC On Housing Allocations: తెలంగాణలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఆ భూకేటాయింపులు రద్దు
- SC On Housing Allocations: తెలంగాణలో భూ కేటాయింపులై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ప్రజా ప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులకు ప్రభుత్వ భూ కేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. వడ్డీతో రిఫండ్ చెల్లించాలని ఆదేశించింది.
తెలంగాణ News Live: Warangal : భూకైలాస్.. ఎకరం రూ.50 కోట్లు, ఈ ప్రాంతాల్లో భూములున్న వారికి డబ్బులే డబ్బులు!
- Warangal : వరంగల్ జిల్లాలో మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉంది. భూ క్రయవిక్రయాలు పెద్దగా లేవు. కొనడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ.. సడెన్‌గా వరంగల్ చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలోచ్చాయి. పలు చోట్ల ఎకరం రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకు పలుకుతోంది.
తెలంగాణ News Live: TG Road Tax : తెలంగాణ వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. రోడ్ ట్యాక్స్ పెంపునకు కసరత్తు
- TG Road Tax : కొన్ని రాష్ట్రాల్లో రవాణా శాఖ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తోంది. ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలంగాణ అధికారులు స్టడీ చేశారు. ఆ విధానాలనే తెలంగాణలో అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే.. తెలంగాణలోనూ రోడ్ ట్యాక్స్ పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ News Live: Minister Sridhar: కరీంనగర్‌లో మరో లక్ష ఎకరాలకు సాగునీరిస్తామన్న శ్రీధర్‌బాబు, పత్తిపాక రిజర్వాయర్ స్థల పరిశీలన
- Minister Sridhar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కసరత్తు చేస్తుంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలో పనిలో నిమగ్నమయింది.
తెలంగాణ News Live: Hanmakonda Child Death: హనుమకొండలో మూడు నెలల చిన్నారి అనుమానాస్పద మృతి, విషప్రయోగంపై అనుమానాలు..
- Hanmakonda Child Death: హనుమకొండ జిల్లాలో మూడు నెలల చిన్నారి అనుమానాస్పదంగా మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో సడెన్ గా నోట్లో నుంచి నురగలు రావడంతో పేరెంట్స్ చిన్నారిని అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
తెలంగాణ News Live: KTR Tour: నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్, ఫ్లెక్సీ వార్‌తో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం
- KTR Tour: మహబూబాబాద్ జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్ల ఘటన బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ మహా ధర్నా నిర్వహించనుండగా.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు.కేటీఆర్ రాక ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు.
తెలంగాణ News Live: BJP Memberships: BJP సభ్యత్వంలో కరీంనగర్ టాప్, సభ్యత్వం తీసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
- BJP Memberships: BJP Memberships భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలిచింది. పార్టీ నాయకత్వం విధించిన లక్ష్యాన్ని మించి సభ్యులను నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల 67 వేల సభ్యత్వాన్ని నమోదు చేయించాలని లక్ష్యం విధించగా, దాదాపు 30 లక్షల సభ్యత్వం నమోదు చేశారు.
తెలంగాణ News Live: BRS Harishrao: అబద్దాల్లో సీఎం రేవంత్ రెడ్డికి పిహెచ్‌డీ ఇవ్వాలన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు
- BRS Harishrao: అబద్ధాలు చెప్పడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిహెచ్డీ ఇవ్వాలన్నారు బిజేపి నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. అబద్దాలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఏమేమి ఎగబెట్టారో అక్కడ ప్రజలకు గుర్తొచ్చిందన్నారు.