తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila : వైఎస్ షర్మిల అరెస్టు.. పాదయాత్రలో బస్సును తగలబెట్టిన దుండగులు

YS Sharmila : వైఎస్ షర్మిల అరెస్టు.. పాదయాత్రలో బస్సును తగలబెట్టిన దుండగులు

HT Telugu Desk HT Telugu

28 November 2022, 16:18 IST

    • YS Sharmila Padayatra : వైఎస్ షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. షర్మిల కార్ వ్యాన్ ను కొంతమంది తగలబెట్టారు. వాహనాలపై రాళ్ళు రువ్వారు. శాంతిభద్రతల దృష్ట్యా షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత
షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

నర్సంపేటలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాదయాత్ర(Padayatra) నర్సంపేటలో 223వ రోజుకు చేరుకుంది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల కామెంట్స్ చేశారు. పాదయాత్రను టీఆర్ఎస్(TRS) నేతలు అడ్డుకుంటారని ఉదయం నుంచే జోరుగా ప్రచారం జరిగింది. పోలీసులు భారీగా వచ్చారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనుమకొండ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరంతండా వద్ద పాదయాత్ర బస్సుపై దాడి చేశారు. కిరోసిన్ పోసి.. బస్సును కాల్చే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ షర్మిల కార్ వ్యాన్ ను తగలబెట్టారు. మంటలు వ్యాపించడంతో వైఎస్ఆర్టీపీ(YSRTP) కార్యకర్తలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. కొంతమంది పాదయాత్ర వాహనాలపై రాళ్లు రువ్వారు. షర్మిల గో బ్యాక్ అని నినాదాలు చేశారు. అయితే ఇదంతా చేసేది టీఆర్ఎస్ కార్యకర్తలు అని షర్మిల ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో షర్మిలను పోలీసులు(Police) అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, వైఎస్సార్​టీపీ మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితులు చేయి దాటి పోతుండటంతో పోలీసులు ఆమెను అదుపులోకీ తీసుకున్నారు.

మరోవైపు టీఆర్ఎస్(TRS) కార్యకర్తలు వైఎస్ఆర్టీపీకి చెందిన ఫ్లెక్సీలు చెంపేశారు. హనుమకొండ జిల్లా చెన్నారావుపేట మండలంలో షర్మిల పాదయాత్రలో ఉన్న వెహికల్ ను ధ్వంసం చేశారు. షర్మిల వాహనంపై పెట్రోల్‌ పోసి నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై వైఎస్ షర్మిల(YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు తెలిసే.. జరుగుతుందని ఆరోపించారు.