తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Neet Ug Counselling 2022 Starts Today Find Direct Links To Register Here

Telangana NEET UG Counselling 2022: నేటి నుంచే నీట్ కౌన్సెలింగ్.. ప్రక్రియ ఇలా

HT Telugu Desk HT Telugu

11 October 2022, 9:50 IST

  • Telangana NEET UG Counselling 2022 registration: నీట్ యూజీ కోసం తెలంగాణ రాష్ట్రం నిర్వహించే కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

Telangana NEET UG Counselling 2022: రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం
Telangana NEET UG Counselling 2022: రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం (HT File)

Telangana NEET UG Counselling 2022: రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం

Telangana NEET UG Counselling 2022: తెలంగాణ నీట్ యూజీ కౌన్సెల్సింగ్ 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు అక్టోబరు 11న ప్రారంభమైంది. కాళోజీ నారాయణ రావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనుంది.

ట్రెండింగ్ వార్తలు

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

TS Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

TS Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు - ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, IMD తాజా అప్డేట్స్ ఇవే

ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో ప్రవేశానికి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లింక్ క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

అధికారిక ప్రకటన ప్రకారం ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబరు 18, 2022 సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ఈ కింద చూపిన స్టెప్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Telangana NEET UG Counselling 2022: రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?

  • అధికారిక వెబ్‌సైట్ tsmedadm.tsche.in సందర్శించాలి.
  • హోం పేజీలో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయాలి.
  • మీ వివరాలు నింపి సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ప్రక్రియను పూర్తిచేయాలి.
  • ప్రక్రియ పూర్తయ్యాక సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • ఈ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని హార్డ్ కాపీని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

జనరల్ కేటగిరీ కటాఫ్ స్కోరు 117. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే 93 గా ఉంది. అభ్యర్థులు మరిన్ని వివరాలకు కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు.