తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Mega Dsc 2024 Updates : డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా...? మీ సబ్జెక్ట్ సిలబస్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TS Mega DSC 2024 Updates : డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా...? మీ సబ్జెక్ట్ సిలబస్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి

06 March 2024, 9:27 IST

google News
    • Telangana DSC 2024 Syllabus : తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఈసారి నిర్వహించబోయే పరీక్షకు సంబంధించిన సిలబస్ కాపీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది విద్యాశాఖ. ఆ వివరాలను ఇక్కడ చూడండి.
తెలంగాణ డీఎస్సీ - 2024
తెలంగాణ డీఎస్సీ - 2024

తెలంగాణ డీఎస్సీ - 2024

Telangana Mega DSC 2024 : తెలంగాణ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్(Telangana DSC 2024) వచ్చిన సంగతి తెలిసిందే. గత వారంలో నోటిఫికేషన్ రాగా... మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు https://tsdsc.aptonline.in/tsdsc/ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. తొలుత పోస్టును ఎంచుకుని, నిర్దేశిత ఫీజు చెల్లించి Online Applications దరఖాస్తును పూరించాల్సి ఉంటుంది.

తాజాగా భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి.గతంలో డిఎస్సీ దరఖాస్తు చేసుకున్నవారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. తాజా ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా, పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం కొత్తగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

పరీక్షా విధానం

డిఎస్సీ 2024(DSC Exam 2024) ఉద్యోగాల భర్తీని కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింది "ఆన్‌లైన్"‌లో నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. డీఎస్సీ పరీక్షలో జనరల్ నాల్డెజ్, టీచింగ్ తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్(TS TET ) వెయిటేజ్ ఉంటుంది. రాతపరీక్ష తర్వాత టెట్ వెయిటీజీని కలిపి తుది జాబితాను ప్రకటిస్తారు.

సిలబస్...

ఈసారి నిర్వహించే మెగా డీఎస్సీ పరీక్షక కోసం అన్ని సబ్జెక్టుల సిలబస్ అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ విద్యాశాఖ. అభ్యర్థులు https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. Syllabus అనే ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ కనిపించే మీ సబ్జెక్ట్ ఆప్షన్ పక్కన ఉండే డౌన్లోడ్ పై నొక్కాలి.

1 LANGUAGE PANDITS రాసే వారు ఈ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

2 - PHYSICAL EDUCATION TEACHER రాసే వారు ఈ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

3 SCHOOL ASSITANT(ALL SUBJECTS)రాసే వారు ఈ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

4 SECONDARY GRADE TEACHER రాసే వారు ఈ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జిల్లాల వారీగా ఖాళీలు ఇవే…

కొత్తగా విడుదలై డీఎస్సీ నోటిఫికేషన్(Telangana DSC Notification) లోని ఖాళీల్లో హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 537 అత్యధికంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో కేవలం 21 మాత్రమే ఉండగా…. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అత్య‌ధికంగా ఖ‌మ్మం జిల్లాలో 176 ఉన్నాయి. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి.ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఎస్టీటీలు 209గా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 ఎస్జీటీ ఖాళీలు ఉన్నాయి.

హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 158 ఉండగా... ఎస్జీటీ ఉద్యోగాలు 81 ఉన్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో చూస్తే...స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 99 ఉన్నాయి. ఎస్జీటీ ఉద్యోగాలు 161గా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా...224 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్ అసిస్టెంట్ లు ఖాళీగా ఉంటే... 137 పోస్టులు ఎస్జీటీలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం