AP TET Response Sheets : ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్, రెస్పాన్స్ షీట్లు విడుదల- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!
AP TET Response Sheets : ఏపీ టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు అలర్ట్. పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్ సైట్ లో టెట్ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేసింది. అభ్యర్థులు ఈ కింది విధంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు
AP TET Response Sheets : ఏపీలో టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను(AP TET Response Sheets) పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఏపీ టెట్ అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ లో అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ పాఠశాల విద్యా శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో టెట్ 2024 రెస్పాన్స్ షీట్లను విడుదల చేసింది. అభ్యర్థులు తన ID, పుట్టిన తేదీలతో రెస్పాన్ షీట్లను యాక్సెస్ చేయవచ్చు.
ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్(AP TET Response Sheets Download) డౌన్ లోడ్ ఎలా?
Step 1 : ఏపీ టెట్ aptet.apcfss.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
Step 2 : హోమ్‌పేజీలో రెస్పాన్స్ షీట్ల లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3 : అభ్యర్థి ID, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి.
Step 4 : AP TET రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
ఏపీ టెట్ కీ(AP TET Key 2024) విడుదల ఎప్పుడు?
పాఠశాల విద్యా శాఖ టెట్ ప్రాథమిక కీని(AP TET Key) మార్చి 10 న విడుదల చేస్తుంది. అభ్యర్థులు మార్చి 11 వరకు కీ పై అభ్యంతరాలను తెలియజేయవచ్చు. రెండు పేపర్లకు కీ లను విడిగా విడుదల చేస్తుంది. ఫైనల్ ఆన్సర్ కీ ని మార్చి 13న విడుదల చేస్తారు. ఏపీ టెట్ తుది ఫలితాలను(AP TET 2024 Results) మార్చి 14న ప్రకటిస్తారు.
టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గడువు
ఏపీ డీఎస్సీ, టెట్ పరీక్షల(AP DSC TET Exams) నిర్వహణపై హైకోర్టు(High Court) సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. రాత పరీక్ష అనంతరం కీ పై అభ్యంతరాలు స్వీకరణలు సమయం ఇవ్వాలని తెలిపింది. మార్చి 15 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన డీఎస్సీ షెడ్యూల్‌ను(DSC Exam Schedule) హైకోర్టు సస్పెండ్ చేసింది. ఏపీ టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న వస్తాయని, మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెడుతున్నారని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు... టెట్, డీఎస్సీ పరీక్ష మధ్య నాలుగు వారాల గడువు ఉండాలని ఆదేశించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది జువ్వాడి శరత్ చంద్ర హైకోర్టు వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 2,67,559 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 120 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సంబంధిత కథనం