AP Govt Jobs : ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ - వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వివరాలివే
Vijayawada YSRUHS Recruitment 2024 : ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. డాక్టర్ వైఎస్సాఆర్ హెల్త్ వర్శిటీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ అయింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి….
Dr. YSR University of Health Sciences Jobs : విజయవాడలోని డాక్టర్ వైఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా… పలు జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది. జనవరి 12వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా… ఫిబ్రవరి 1వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - డాక్టర్ వైఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ
ఉద్యోగాల పేరు - జూనియర్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు - 20 ఉద్యోగాలు
అర్హత - దరఖాస్తు చేసుకునేవారు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి - 01.07.2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం - నెలకు రూ.25,220-రూ.80,910.
ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం - ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు - ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనికులు/ దివ్యాంగులకు రూ.750. ఇతరులకు రూ.1500.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం - 12. జనవరి.2024.
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ - 31.జనవరి.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు తుది గడువు - 01. ఫిబ్రవరి.2024.
సీబీటీ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. స్క్రీనింగ్ ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది. ఇక మెయిన్స్ ఎగ్జామ్ లో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. మొత్తం 300 మార్కులకు మెయిన్స్ ఉంటాయి.
అధికారిక వెబ్ సైట్ - http://drysruhs.edu.in/