తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Jana Samithi To Merge The With The Aam Aadmi Party

'ఆప్' లో టీజేఎస్ విలీనం..? నగర శివారులో రహస్య భేటీ అజెండా ఏంటీ..?

HT Telugu Desk HT Telugu

27 March 2022, 13:44 IST

    • నగర శివారులోని ఓ ఫాంహౌజ్ లో టీజేఎస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. అయితే ఆప్ లో విలీనంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. 
ఆప్ లో టీజేఎస్ విలీనం
ఆప్ లో టీజేఎస్ విలీనం (Twitter)

ఆప్ లో టీజేఎస్ విలీనం

టీజేఎస్ (తెలంగాణ జన సమితి) ఆప్ లో విలీనం అవుతుందా..? ఆ దిశగా అడుగులు పడుతున్నాయా..? అన్న ప్రశ్నలపై తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇవాళ ఆ పార్టీ అధినేత కొదండరాం అధ్యక్షతన కీలక నేతలు నగర శివారు ఇబ్రహీంపట్నం పరిధిలోని ఓ ఫామ్ హౌజ్ లో రహస్యంగా భేటీ అయ్యారని తెలిసింది. విలీన అంశంపైనే కీలకంగా చర్చ జరిగినట్లు సమాచారం. రహస్యంగా నిర్వహించిన ఈ భేటీలో ఎక్కువ మంది నేతలు తెలంగాణ జన సమితి పార్టీని ఆమ్ఆద్మీ పార్టీలో విలీనం చేయడానికి మొగ్గు చూపినట్లుగా సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Parenting Tips : వేసవి సెలవులలో పిల్లలపై దృష్టి పెట్టండి-ఆ బాధ్యత తల్లిదండ్రులదే!

Sangareddy Crime : సంగారెడ్డిలో దారుణం, ఓ వ్యక్తిని హత్య చేసి పొలంలో పడేసిన దుండగులు

TS SSC Supplementary Exams: రీ కౌంటింగ్ ఫలితాల కోసం ఆగొద్దు.. సప్లిమెంటరీకి అప్లై చేయాలని బోర్డు సూచన…

TS SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల.. 91శాతం ఉత్తీర్ణత, గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు

గతంలోనూ జాతీయ పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీలో టీజేఎస్ విలీనం అవుతుందన్న చర్చ భాగానే జరిగింది. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు కోదండరాం. తాజాగా ఇదే అంశంపై ఆప్ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో టీజేఎస్ విలీనం పక్కా అనే చర్చ జోరుగా సాగుతోంది.

పంజాబ్ లో విక్టరీ కొట్టిన ఆప్.. తెలంగాలో బలోపేతం కావాలని చూస్తోంది. త్వరలోనే కేజ్రీవాల్ తెలంగాణ పర్యటనకు రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆపార్టీ నేతలు పాదయాత్ర చేపట్టేలా వ్యూహాం రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో టీజేఎస్ ను విలీనం చేసుకుని.. మరింత ముందుకెళ్లొచ్చనే ఆలోచనలో ఆప్ ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.