తెలుగు న్యూస్  /  Telangana  /  Suspense Continues On Cbi Notices To Trs Mlc Kalvakuntla Kavita

CBI Notices : సిబిఐ విచారణపై ఉత్కంఠ….

HT Telugu Desk HT Telugu

06 December 2022, 11:03 IST

    • CBI Notices సిబిఐ విచారణకు హాజరు కాలేనంటూ సిబిఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన నేపథ్యంలో  ఏం జరుగుతుందోనని  ఉత్కంఠ నెలకొంది.  ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సిబిఐకు నోటీసులు జారీ చేసింది. ముందుగా ఖరారు చేసుకున్న  షెడ్యూల్ ప్రకారం  మంగళవారం విచారణకు తాను రాలేనంటూ  కవిత ఇప్పటికే  సిబిఐ లేఖ రాశారు.
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

CBI Notices ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో టిఆర్‌ఎసస్‌ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం తాను విచారణకు హాజరు కాలేనంటూ సిబిఐకు కవిత లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన తన నివాసంలో విచారణకు హాజరవుతానంటూ కవిత మొదట్లో సిబిఐకు సమ్మతి తెలిపారు. ఆ తర్వాత ఎఫ్‌ఆర్ కాపీ కావాలని కోరడంతో సిబిఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని సిబిఐ అధికారులు మెయిల్‌ ద్వారా తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

TS DOST Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని, మంగళవారం తాను అందుబాటులో ఉండనని కవిత మరో లేఖను రాశారు. ముందుగా నిర్ణయించుకున్న సమావేశాలకు హాజరు కావాల్సి ఉండటంతో వెళ్లాల్సి ఉండటంతో మరో రోజు విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా తన పేరు లేదని కల్వకుంట్ల కవిత సిబిఐకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

నిందితుల జాబితాలో తన పేరు లేదని, ముందే ఖరారు చేసుకున్న కార్యక్రమాల వల్ల 6వ తేదీన తాను విచారణకు రాలేనని కవిత చెప్పారు. ఈ మేరకు సిబిఐ డిఐజి రాఘవేంద్రకు లేఖను రాశారు. సిబిఐ అధికారులు మెయిల్‌ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా హోంశాఖ ఫిర్యాదు ఆధారంగా సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని కవిత న్యాయవాదులు పరిశీలించారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా తన పేరు లేనందున ఆరవ తేదీన తాను సీబీఐ అధికారులను కలవలేనని చెప్పారు. 11,12,14,15 తేదీల్లో సీబీఐ అధికారులకు అనువుగా ఉన్న తేదీలలో హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ కావడానికి అభ్యంతరం లేదని కవిత లేఖలో వివరించారు. దర్యాప్తుకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఏదొక రోజు సిబిఐ అధికారులతో భేటీ అవుతానని కవిత సిబిఐ డిఐజికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

స్పందించని సిబిఐ… కొనసాగుతున్న ఉత్కంఠత…

మరోవైపు సిబిఐకు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై ఉత్కంఠ కొనసాగుతోంది. విచారణకు హాజరు కాలేనంటూ కవిత లేఖ రాయడంపై సిబిఐ సమాధానం ఇవ్వలేదు. గత ఆగష్టులో ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాక, అందులో కేసీఆర్ కుమార్తె పాత్ర ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల అరెస్టులు జరిగాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో వేధిస్తున్నారని, అందులో తన ప్రమేయం లేదని కవిత అప్పట్లోనే ఖండించారు. ఆ తర్వాత ఆమె పేరు బయటకు రాకపోయినా సిబిఐ ఆమెకు నోటీసులు జారీ చేయడంతో కలకలం రేగింది. మరోవైపు మంగళవారం కవిత జగిత్యాల వెళ్లనున్నారు. బుదవారం సిఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనేందుకు కవిత జగిత్యాల బయలుదేరుతున్నారు. తిరిగి బుధవారం రాత్రికి హైదరాబాద్‌ రానున్నారు.

టాపిక్