Railway Alert : రైల్వే అలర్ట్.. పది రైళ్ల రద్దు.. 18 రైళ్లకు వరంగల్‌లో స్టాప్ తొలగింపు
22 September 2024, 18:12 IST
- Railway Alert : వివిధ కారణాలతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. 18 రైళ్లకు వరంగల్‌లో స్టాప్ తొలగించింది. రైల్వే ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించింది. రెండు రైళ్లు రీషెడ్యూల్ చేసి.. నాలుగు రైళ్లు షార్ట్ టెర్మినేషన్ చేశారు రైల్వే అధికారులు.
రైల్వే అలర్ట్
దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ డివిజన్‌లోని.. కొవ్వూరు - గోదావరి - రాజమండ్రి - కడియం సెక్షన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్‌ను ప్రారంభించనున్నారు. ఇందు కోసం నాన్- ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతున్నారు. ఈ కారణంగా పది రైళ్లు రద్దు చేశారు.
1. తిరుపతి నుండి బయలుదేరే తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ (22708) రైలు సెప్టెంబర్ 29న రద్దు చేశారు.
2. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం- తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ (22707) రైలు సెప్టెంబర్ 30న రద్దు చేశారు.
3. విజయవాడ నుండి బయలుదేరే విజయవాడ-విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718) రైలు సెప్టెంబర్ 30న రద్దు చేశారు.
4. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం- విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12717) రైలు సెప్టెంబర్ 30న రద్దు చేశారు.
5. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం - గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22701) రైలు సెప్టెంబర్ 30న రద్దు చేశారు.
6. గుంటూరు నుండి బయలుదేరే గుంటూరు - విశాఖపట్నం - ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22702) రైలు సెప్టెంబర్ 30న రద్దు చేశారు.
7. గుంటూరు నుండి బయలుదేరే గుంటూరు - విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239) రైలు సెప్టెంబర్ 29, 30 తేదీలలో రద్దు చేశారు.
8. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240) రైలు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీలలో రద్దు చేశారు.
9. రాజమండ్రి నుండి బయలుదేరే రాజమండ్రి-విశాఖపట్నం మెము ప్యాసింజర్ (07466 ) రైలు సెప్టెంబర్ 30న రద్దు చేశారు.
10. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం - రాజమండ్రి మెము ప్యాసింజర్ (07467) రైలు సెప్టెంబర్ 30న రద్దు చేశారు.
18 రైళ్లకు స్టాప్ తొలగింపు..
విజయవాడ - కాజీపేట - బల్హార్ష సెక్షన్‌లోని, హసన్‌పర్తి - కాజీపేట 'ఎఫ్' క్యాబిన్ - వరంగల్ స్టేషన్ల మధ్య నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా వరంగల్ స్టేషన్‌లో 18 రైళ్లకు స్టాప్‌లు తొలగించారు.
1. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (12739) రైలుకు సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు నాలుగు రోజుల పాటు వరంగల్‌లో స్టాప్ ఉండదు. ప్రత్యామ్నాయంగా కాజీపేటలో హాల్ట్ ఉంటుంది.
2. సికింద్రాబాద్‌లో బయలుదేరే సికింద్రాబాద్-విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (12740) రైలుకు సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు వరంగల్‌లో స్టాప్ ఉండదు. ప్రత్యామ్నాయంగా కాజీపేటలో హాల్ట్ ఉంటుంది.
3. షాలిమార్ నుండి బయలుదేరే షాలిమార్ - సికింద్రాబాద్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12773) రైలుకు సెప్టెంబర్ 25న వరంగల్‌లో స్టాప్ ఉండదు. ప్రత్యామ్నాయంగా కాజీపేటలో హాల్ట్ ఉంటుంది.
4. టాటా నుండి బయలుదేరే టాటా - యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (18111) రైలుకు సెప్టెంబర్ 26న వరంగల్‌లో స్టాప్ ఉండదు. ప్రత్యామ్నాయంగా కాజీపేటలో హాల్ట్ ఉంటుంది.
5. సికింద్రాబాద్ నుండి బయలుదేరే సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20707) రైలుకు సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వరంగల్‌లో స్టాప్ ఉండదు. ప్రత్యామ్నాయంగా కాజీపేటలో హాల్ట్ ఉంటుంది.
6. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20708) రైలుకు సెప్టెంబర్ 27, 28, 29 తేదీల్లో వరంగల్‌లో స్టాప్ ఉండదు. ప్రత్యామ్నాయంగా కాజీపేటలో హాల్ట్ ఉంటుంది.
7. సికింద్రాబాద్ నుండి బయలుదేరే సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20834) రైలుకు సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో వరంగల్‌లో స్టాప్ ఉండదు. ప్రత్యామ్నాయంగా కాజీపేటలో హాల్ట్ ఉంటుంది.
8. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20833) రైలుకు సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో వరంగల్‌లో స్టాప్ ఉండదు. ప్రత్యామ్నాయంగా కాజీపేటలో హాల్ట్ ఉంటుంది.
9. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) రైలుకు సెప్టెంబర్ 25, 26, 27, 28 తేదీల్లో వరంగల్‌లో స్టాప్ ఉండదు.
10. హైదరాబాద్ నుంచి బయలుదేరే హైదరాబాద్ - విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (12728) రైలుకు సెప్టెంబర్ 26, 27, 28, 29 తేదీల్లో వరంగల్‌లో స్టాప్ ఉండదు.
11. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం - మహబూబ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12861) రైలుకు సెప్టెంబర్ 25, 26, 27, 28 తేదీల్లో వరంగల్‌లో స్టాప్ ఉండదు.
12. మహబూబ్‌నగర్ నుండి బయలుదేరే మహబూబ్‌నగర్ - విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12862) రైలుకు సెప్టెంబర్ 26, 27, 28, 29 తేదీల్లో వరంగల్‌లో స్టాప్ ఉండదు.
13. షాలిమార్ నుండి బయలుదేరే షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045) రైలుకు సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో వరంగల్‌లో స్టాప్ ఉండదు.
14. హైదరాబాద్ నుండి బయలుదేరే హైదరాబాద్ - షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18046) రైలుకు సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో వరంగల్‌లో స్టాప్ ఉండదు.
15. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం - సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ (18503) రైలుకు సెప్టెంబర్ 26న వరంగల్‌లో స్టాప్ ఉండదు.
16. సాయినగర్ షిర్డీ నుండి బయలుదేరే సాయినగర్ షిర్డీ -విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18504) రైలుకు సెప్టెంబర్ 27న వరంగల్‌లో స్టాప్ ఉండదు.
17. షాలిమార్ నుండి బయలుదేరే షాలిమార్-సికింద్రాబాద్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22849) రైలుకు సెప్టెంబర్ 25న వరంగల్‌లో స్టాప్ ఉండదు.
18. సికింద్రాబాద్ నుండి బయలుదేరే సికింద్రాబాద్ - షాలిమార్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22850) రైలుకు సెప్టెంబర్ 27న వరంగల్‌లో స్టాప్ ఉండదు. ప్రజలు మార్పులను గమనించి తదనుగుణంగా ప్రయాణాలు ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
రెండు రైళ్లు రీషెడ్యూల్, నాలుగు రైళ్లు షార్ట్‌టెర్మినేషన్..
సెప్టెంబరు 23, 26, 28 తేదీలలో వాల్తేర్ డివిజన్‌లోని నౌపడ - పుండి సెక్షన్‌లో భద్రతా పనుల దృష్ట్యా.. రైలు సర్వీసులు ప్రభావితమవుతాయని అధికారులు వెల్లడించారు.
రైళ్ల రీషెడ్యూల్..
1. పుదుచ్చేరి - భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12897) రైలు సెప్టెంబర్ 25న 2.45 గంటల ఆలస్యంగా సాయంత్రం 6:50 గంటలకు బదులు, రాత్రి 9:35 గంటలకు పుదుచ్చేరి నుండి బయలుదేరేలా రీషెడ్యూల్ చేశారు.
2. కేఎస్ఆర్ బెంగళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) రైలు సెప్టెంబర్ 25, 27 తేదీల్లో 2.30 గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 1.40 గంటలకు బదులు, సాయంత్ర 4.10 గంటలకు కేఎస్ఆర్ బెంగళూరు నుండి బయలుదేరుతుంది.
రైళ్ల షార్ట్‌టెర్మినేషన్..
1. రూర్కెలా నుండి బయలుదేరే రూర్కెలా- గుణుపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ (18117) రైలు పలాసలో షార్ట్ టర్మినేట్ చేశారు.
2. గుణుపూర్ -రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ (18118) రైలు గుణుపూర్‌కు బదులుగా పలాస నుండి బయలుదేరుతుంది.
3. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం - పలాస మెము (07470) రైలు సెప్టెంబర్ 26, 28 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డులో షార్ట్ టర్మినేట్ అవుతుంది.
4. పలాస - విశాఖపట్నం మెము (07471) రైలు ఆ రెండు తేదీల్లో పలాసకు బదులుగా శ్రీకాకుళం రోడ్ నుండి బయలుదేరుతుంది. ప్రజలు మార్పులను గమనించాలని రైల్వే అధికారి కె. సందీప్ సూచించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)