తెలుగు న్యూస్ / ఫోటో /
Shirdi Tour Package : ఒకే ట్రిప్ లో శనిశిగ్నాపూర్, షిర్డీ దర్శనం - విజయవాడ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ, వివరాలివే
- షిర్డీ సాయి బాబాను దర్శించుకునేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. విజయనాడ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ చూసి రావొచ్చు. ప్రస్తుతం సెప్టెంబర్ 24వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
- షిర్డీ సాయి బాబాను దర్శించుకునేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. విజయనాడ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ చూసి రావొచ్చు. ప్రస్తుతం సెప్టెంబర్ 24వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
(1 / 7)
అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకునేందుకు విజయవాడ నుంచి ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 'SAI SANNIDHI EX - VIJAYAWADA' పేరుతో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.(Image Source unsplash.com)
(2 / 7)
3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ మంగళవారం తేదీల్లో జర్నీ ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 24, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. (Image Source @SSSTShirdi 'X' Account)
(3 / 7)
ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు శనిశిగ్నాపూర్ కూడా కవర్ అవుతుంది. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. (Image Source @SSSTShirdi 'X' Account)
(4 / 7)
మొదటి రోజు విజయవాడలో స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208) ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.ఇక 2వ రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి బయల్దేరుతారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాల్సి ఉంటుంది.(Image Source @SSSTShirdi 'X' Account)
(5 / 7)
3వ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. శని దేవుడిని దర్శించుకుంటారు. ఆ తర్వాత నాగర్ సోల్ కు చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడకు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(Image Source @SSSTShirdi 'X' Account)
(6 / 7)
విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్ (3ఏ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 15900ధర ఉంది.. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10070, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8560 చెల్లించాలి. స్టాండర్డ్ క్లాస్ (3ఏ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 13450 ధర ఉండగా… డబుల్ ఆక్యుపెన్సీకి రూ.7620గా ఉంటుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 6110గా నిర్ణయించారు. (Image Source @SSSTShirdi 'X' Account)
ఇతర గ్యాలరీలు