Ayodhya Kashi IRCTC Tour : కాశీ, అయోధ్య సహా 6 పుణ్య క్షేత్రాల తీర్థయాత్ర-సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
- Ayodhya Kashi IRCTC Tour : కాశీ, అయోధ్యతో పాటు పలు పవిత్ర పుణ్య క్షేత్రాల దర్శనానికి సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ ను కవర్ చేస్తూ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నడపనున్నారు. 10 రోజుల టూర్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది.
- Ayodhya Kashi IRCTC Tour : కాశీ, అయోధ్యతో పాటు పలు పవిత్ర పుణ్య క్షేత్రాల దర్శనానికి సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ ను కవర్ చేస్తూ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నడపనున్నారు. 10 రోజుల టూర్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది.
(1 / 6)
కాశీ, అయోధ్యతో పాటు పలు పవిత్ర పుణ్య క్షేత్రాల దర్శనానికి సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ ను కవర్ చేస్తూ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నడపనున్నారు.
(2 / 6)
10 రోజుల పర్యటనలో ఆరు ముఖ్యమైన తీర్థయాత్రలు, పలు ఆలయాలు దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.16,820 గా ఐఆర్సీటీసీ నిర్ణయించింది. సెప్టెంబర్ 28న అయోధ్య, కాశీ పుణ్య క్షేత్ర భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలులో మొత్తం సీట్ల సంఖ్య 718(ఎస్ఎల్: 460, 3ఏసీ: 206, 2ఏసీ: 52)
(3 / 6)
టూర్ ధరలు : ఎకానమీ (SL) -రూ 16,820(పెద్దలకు), రూ. 15,700(పిల్లలకు)స్టాండర్ట్(3AC) -రూ. 26,680(పెద్దలకు), రూ. 25,370(పిల్లలకు)కంఫర్ట్ (2AC)- రూ. 34,950(పెద్దలకు), రూ. 33,380(పిల్లలకు)
(4 / 6)
28.09.2024 - సికింద్రాబాద్ లో భారత్ గౌరవ్ రైలు బయలుదేరుతుంది. 29.09.2024- పూరీ జగన్నాథ ఆలయ సందర్శన30.09.2024 - కోణార్క్ సూర్య దేవాలయం సందర్శన 01.10.2024 - బుద్ధగయలో విష్ణుపాద్ ఆలయం సందర్శన 02.10.2024 - బెనారస్ సారనాథ్ స్థూపం సందర్శన
(5 / 6)
03.10.2024 - కాశీ విశ్వనాథ దేవాలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం సాక్షి గంగా హారతి వీక్షిస్తారు. 04.10.2024 - అయోధ్య రామమందిరాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం సరయు నది వద్ద హారతి వీక్షిస్తారు.
ఇతర గ్యాలరీలు