తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Trains Cancelled : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రద్దు

Trains cancelled : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రద్దు

HT Telugu Desk HT Telugu

10 March 2023, 9:01 IST

    • Trains cancelled ట్రాక్షన్ మరమ్మతులకోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.  కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేస్తుండగా మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు (PTI)

సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు

ట్రైన్ నంబర్ 01414/01413 పండార్‌పూర్‌-నిజామాబాద్-పంఢార్‌పూర్‌ రైలును 10,11 తేదీల్లో రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. ట్రాక్షన్ మరమ్మతుల రీత్యా పలు రైళ్లు ఆలశ్యంగా నడుస్తాయని అధికారులు ప్రకటించారు. ట్రైన్ నంబర్ 17617 ముంబై సిఎస్‌టి-నాందేడ్ రెండు గంటలకు పైగా నియంత్రిస్తారు. ట్రైన్ నంబర్ 17630 నాందేడ్-పూణే రైలును కూడా రెండు గంటల పైగా నియంత్రిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

ట్రైన్‌ నంబర్ 17661 కాచిగూడ- రోటేగావ్ రైలును మూడుగంటలు, ట్రైన్ నంబర్ 12788 నాగర్‌సోల్‌-నర్సాపూర్‌ రైలును 14వ తేదీన గంటన్నర, ట్రైన్ నంబర్ 17232 నాగర్‌సోల్ - నర్సాపూర్ రైలును 11వ తేదీన గంటన్నర నియంత్రిస్తారు. ధర్మవరం-మన్మాడ్ రైలును 12, 15 తేదీలలో గంట పాటు రీ షెడ్యూల్ చేస్తారు.

గంగినేని-ఎర్రుపాలెం స్టేషన్ల వద్ద నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు.

ట్రైన్ నంబర్ 07091/07092 కాజీపేట-తిరుపతి-కాజీపేట రైలునుఈ నెల 14వ తేదీ రద్దు చేశారు. 07185/07186 మచిలీపట్నం-సికింద్రాబాద్‌ రైలును ఈ నెల 12వ తేదీ రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07755/07756 విజయవాడ-డోర్నకల్‌-విజయవాడ ప్యాసింజర్ రైలును ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు రద్దు చేశారు. ట్రైన్ నంబర్‌ 07465/07464 విజయవాడ-గుంటూరు ప్యాసింజర్ రైలును (ఈ నెల 10వ తేదీ నుంచి 18వరకు, ట్రైన్ నంబర్ 07979/07278 విజయవాడ-భద్రాచలం రోడ్‌ రైలును ఈ నెల 10వ తేదీ నుంచి 18వరకు రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 17201/17202 గుంటూరు-సికింద్రాబాద్‌ రైలును కాజీపేట-గుంటూరు మధ్య రద్దు చేశారు. ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండదు. ట్రైన్ నంబర్ 12705/1270 గుంటూరు-సికింద్రాబాద్‌ రైలును ఖమ్మం-గుంటూరు మధ్య ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు చేశారు. .

టాపిక్