Special Trains From Hyderabad: యశ్వంతపూర్, నాందేడ్, తిరుపతికి ప్రత్యేక రైళ్లు
01 September 2022, 9:48 IST
- Special Trains From Telugu States: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. తాజాగా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించగా... యశ్వంతపూర్, నాందేడ్ కు కూడా ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు,
South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి యశ్వంతపూర్, హైదరాబాద్ నుంచి యశ్వంతపూర్, నాందేడ్ నుంచి తిరుపతి, తిరుపతి - నాందేడ్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
Hyderabad - Yesvantpur special trains: హైదరాబాద్ నుంచి యశ్వంతపూర మధ్య స్పెషల్ ట్రైన్ ప్రకటించారు. ఈ రైలు ఆగస్టు 31వ తేదీన 09.15 గంటలకు బయల్దేరి.. మరునాడు ఉదయం 10.50కు యశ్వంతపూర్ కు చేరుకుంటుంది. ఇక యశ్వంతపూర్ నుంచి సెప్టెంబర్ 1వ తేదీన 03.50 గంటలకు బయల్దేరి మరునాడు ఉదయం 05 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.
ఈ రైళ్లు బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, యద్ గిరి, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్లు, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, ఎల్హాంక స్టేషన్లలో ఆగుతుంది.
Secunderabad to Yesvantpur Trains: సికింద్రాబాద్ - యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 2 వ తేదీన రాత్రి 8 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు 10.30 గంటలకు యశ్వంతపూర్ కు చేరుకుంటుంది. ఇక యశ్వంతపూర్ నుంచి సెప్టెంబర్ 3వ తేదీన సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరి మరునాడు ఉదయం 7.30 గంటలకు గమ్యస్థలానికి చేరుతుంది.
ఈ స్పెషల్ ట్రైన్ కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్, ఎల్హాంక స్టేషన్లలో ఆగుతుంది.
H.S Nanded - Tirupati Special Trains: నాందేడ్ నుంచి తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ రైలు సెప్టెంబర్ 3వ తేదీన నాందేడ్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.30 గంటలకు తిరుపతికి చేరుతుంది. ఇక తిరుపతి నుంచి సెప్టెంబర్ 4వ తేదీన 09.10 గంటలకు బయల్దేరి... మరునాడు సాయంత్రం 5.20 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.
ఈ స్పెషల్ ట్రైన్ పుర్ణ, పర్బాణీ, గంగాఖేర్, పర్లివైజ్ నాథ్, లాటర్ రోడ్, ఉద్గిరి, బల్కి, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, తాండూరు, సెరం, చిత్తపూర్, సూలేహల్లీ, యాద్గిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయంరోడ్డు, ఆదోని, గుంతకల్లు, గూటి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.