తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains: తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి స్పెషల్ ట్రైన్స్ - వివరాలివే

SCR Special Trains: తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి స్పెషల్ ట్రైన్స్ - వివరాలివే

HT Telugu Desk HT Telugu

04 January 2023, 15:58 IST

    • south central railway special trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తాజాగా తిరుపతి వెెళ్లే వారి కోసం మరికొన్ని ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 
తిరుపతికి ప్రత్యేక రైళ్లు
తిరుపతికి ప్రత్యేక రైళ్లు

తిరుపతికి ప్రత్యేక రైళ్లు

SCR Special Trains Latest: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరికొన్ని స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఇప్పటికే సంక్రాంతికి పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించగా.. తాజాగా తిరుపతి వెళ్లే వారి కోసం మరికొన్నింటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. నర్సాపూర్ - కాచిగూడ, కాచిగూడ - తిరుపతి, తిరుపతి - కాచిగూడ, సికింద్రాబాద్ - రామంతాపురం, రామంతాపురం - సికింద్రాబాద్ మధ్య ఈ రైళ్లను నడపనుంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

TS ICET 2024 : నేటితో ముగియనున్న టీఎస్ ఐసెట్-2024 దరఖాస్తు గడువు

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, పలు విభాగాల్లో అగ్నివీర్‌ ఎంపికలు

Hyderabad City Tour : హైదరాబాద్ సిటీ టూర్, వండర్ లా లో ఎంజాయ్- తెలంగాణ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

tirupati kachiguda special trains: కాచిగూడ - తిరుపతి (ట్రైన్ 07179) మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ బుధవారం రోజున సేవలు అందిచనుంది. ఇక తిరుపతి నుంచి - కాచిగూడ(07180)కు కూడా ప్రత్యేక రైలు వెళ్లనుంది. ఇది 5వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజ్ గారి, జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

సికింద్రాబాద్ - రామంతపూర్(ట్రైన్ నెం. 07695) మధ్య జనవరి 11, 18,25వ తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. రామంతపూర్ నుంచి సికింద్రాబాద్ (ట్రైన్ నెం. 07696)కు జనవరి 6, 13, 20, 27 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ సేవలు అందిస్తాయి.

ఈ ప్రత్యేక రైళ్లు... నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, చెన్నై, చెంగల్ పట్టు, విల్లుపురం, చిదంబరం, సిర్ ఖాజీ, తిరువుర్, తిరుతురైపుండి, అదిరామ్ పట్నం, పట్టుకొట్టై, అరంటంగి, కరైకుడి, శివగంగా, మనమధురై స్టేషన్లల్లో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లలో 2ac, 3ac స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రయాణికులను కోరారు.