తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Diwali Special Trains: సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు… వివరాలివే

Diwali Special Trains: సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు… వివరాలివే

HT Telugu Desk HT Telugu

21 October 2022, 15:26 IST

    • scr diwali special trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
దీపావళి ప్రత్యేక రైళ్లు
దీపావళి ప్రత్యేక రైళ్లు

దీపావళి ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... దీపావళి నేపథ్యంలో మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్, తిరుపతి, నాందేడ్, హడాప్సర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను చూస్తే....

ట్రెండింగ్ వార్తలు

Warangal : వరంగల్ శివారులో అమానుషం - పసికందును ప్రాణాలతోనే పాతిపెట్టారు..!

TS SET Notification 2024 : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల - మే 14 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే

Army Public School Jobs 2024 : బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు - అప్లికేషన్ ప్రాసెస్, ఖాళీల వివరాలివే

Siddipet Accident : పెళ్లి రోజే విషాదం, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

secunderabad - tirupati sepcail trains: తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్లను ఈ నెల 23న నడపనున్నట్లు ప్రకటించారు. ఈ రైలు ఆదివారం 19.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08.50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 24న ప్రకటించారు. ఈ రైలు రాత్రి 07.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08:10 గంటలకుగమ్యానికి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం స్టేషన్లలో ఆగుతాయి.

nanded - Hadapsar special trains: నాందేడ్-హడాప్సర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు అధికారులు. ఈ నెల 23న అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఆయా రోజుల్లో రాత్రి 09.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.45 గంటలకు గమ్యానికి చేరుతుంది. ఇక హడాప్సర్-నాందేడ్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 24న నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు 11.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

ఈ రైలు పూర్ణ, పర్బాణీ, గంగాఖేర్, పర్లీ,వైజనాథ్, లాథూర్ రోడ్, ఉస్మానాబాజ్, ఖుర్దువాడీ స్టేషన్లలో ఆగుతుంది. ఇక ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.