CM KCR | సీఎం కేసీఆర్ పర్యటనపై సందిగ్ధత.. మేడారం వెళతారా? లేదా?
18 February 2022, 11:39 IST
సీఎం కేసీఆర్ మేడారం పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు ఆయన మేడారం పర్యనపై ఎలాంటి స్పష్టత లేదు. షెడ్యూల్ ప్రకారమైతే.. ఉదయమే జాతరకు చేరుకోవాల్సి ఉంది.

సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)
సీఎం కేసీఆర్ మేడారం వెళతారా.. లేదా అనే విషయంపై సందిగ్ధత ఉంది. శుక్రవారం ఉదయం 11.40 గంటలకు కేసీఆర్ మేడారం చేరుకోవాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ.. రాలేదు. ఉదయమే వస్తారని.. మంత్రులు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయన పర్యటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
షెడ్యూల్ ప్రకారమేతే.. ఇలా
హైదరాబాద్ నుంచి మేడారానికి.. ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు మేడారానికి చేరుకోవాల్సి ఉంది. సాయంత్రం వరకూ.. మేడారంలోనే గడపనున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట.. ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి కూడా వస్తారు. ఇప్పటికే.. ఏర్పాట్లపై.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశారు.
ఇప్పటికే పలువురు ప్రముఖులు మేడారాన్ని సందర్శించుకున్నారు. కేంద్ర మంత్రులు రేణుకాసింగ్, జి.కిషన్‌రెడ్డి వనదేవతలు మెుక్కులు చెల్లించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అమ్మల దర్శనానికి రానున్నట్టు తెలుస్తోంది.
టాపిక్