తెలుగు న్యూస్  /  Telangana  /  Rythu Bandhu Funds Will Be Distributed From December Said Minister Niranjan Reddy

Rythu Bandhu: డిసెంబరులోనే రైతుబంధు, రుణమాఫీపై కూడా క్లారిటీ ఇచ్చిన మంత్రి

HT Telugu Desk HT Telugu

25 November 2022, 18:04 IST

    • minister niranjan reddy on rythu bandhu : డిసెంబరులోనే యాసంగి రైతుబంధును ఇస్తామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కరోనా కారణంగా తలెత్తిన ఇబ్బందులతో రుణమాఫీ ఆలస్యమైందని.. రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తామని స్పష్టం చేశారు.
మంత్రి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి (twitter)

మంత్రి నిరంజన్ రెడ్డి

rythu bandhu scheme in telangana: రాబోయే రోజుల్లో రుణమాఫీ చేస్తామన్నారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం జింకలతండాలో శుక్రవారం మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ కలిసి 3 గిడ్డంగులను ప్రారంభించారు. రూ.14.9 కోట్లతో 20 వేల టన్నుల సామర్థ్యంతో నిర్మించిన ఈ గిడ్డంగుల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటలను ఈ నిల్వ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP TS Weather Updates: మండుతున్న ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో జనం విలవిల

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.... డిసెంబర్ లోనే యాసంగి రైతుబంధు ఇస్తామని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తామన్న ఆయన... మన సాగు ఉత్పత్తులు దేశంలోనే ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు. రైతు కేంద్రంగా తెలంగాణలో పాలన కొనసాగుతోందన్నారు. కేంద్రం ధాన్యం కొనకపోతే రాష్ట్రమే ఖర్చు భరించిందని వెల్లడించారు.

ఆయన తెలిపారు. గుజరాత్ లో 24 గంటల కరెంట్ ఎందుకివ్వడం లేదు? బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒక్క ప్రాజెక్టూ ఎందుకు కట్టలేదు? అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని... అందుకే గోదాములు కడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల ఉద్యానవన పంటలు ఉన్నాయని... ఒక లక్ష 46వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్న ఘనత తెలంగాణదని స్పష్టం చేశారు. 65 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు బంధు అందుతోందన్న ఆయన.. ఒక కోటి 48 లక్షల ఎకరాలకు రైతుబంధు అందజేశామని చెప్పారు. దేశంలో సాగుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని వ్యాఖ్యానించారు.

యాసంగిలో పత్తిని పండిచవచ్చని నిరూపించిన రైతులు కూడా ఖమ్మం జిల్లాలోనే ఉన్నారని మంత్రి అన్నారు. కష్టపడి, సుఖపడే రైతులు ఖమ్మం జిల్లాలోనే ఉన్నారని కొనియాడారు. ఒక రైతు వాడే ఒక మోటార్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 వేల రూపాయలు చెల్లిస్తుందని.. తెలంగాణ రాష్ట్రాన్ని , తెలంగాణ రైతులను కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూస్తోందని విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం అండగా నిలబడి రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నారన్నారు. ప్రధాన మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల ఉచిత కరెంటు లేదని దుయ్యబట్టారు. బిజెపి పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనూ రైతులకు ఉచిత కరెంటు లేదని... ఎందుకు ఇవ్వటంలేదని ప్రశ్నించారు.