తెలుగు న్యూస్  /  Telangana  /  Reliance Retail Opens The Gap Store In Hyderabad By Tollywood Actress Anupama Parameswaran

హైదరాబాద్‌లో 'గ్యాప్' స్టోర్‌.. ప్రారంభించిన అనుపమా పరమేశ్వరన్

HT Telugu Desk HT Telugu

26 February 2023, 7:50 IST

    • అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన ‘గ్యాప్’ బ్రాండ్ ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రత్యేక స్టోర్ ద్వారా ప్రజలకు చేరువైంది.
గ్యాప్ స్టోర్ ప్రారంభోత్సవంలో అనుపమా పరమేశ్వరన్
గ్యాప్ స్టోర్ ప్రారంభోత్సవంలో అనుపమా పరమేశ్వరన్

గ్యాప్ స్టోర్ ప్రారంభోత్సవంలో అనుపమా పరమేశ్వరన్

హైద‌రాబాద్: న‌గ‌రంలోని గచ్చిబౌలిలో గల శ‌ర‌త్ సిటీ మాల్‌లో రిల‌య‌న్స్ రిటైల్ లిమిటెడ్‌తో క‌లిసి గ్యాప్‌ త‌న ఫ్రీ స్టాండింగ్ స్టోర్ ప్రారంభించిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ స్టోర్ ఆవిష్క‌ర‌ణ రిల‌య‌న్స్ రిటైల్ లిమిటెడ్‌, గ్యాప్‌ ఐఎన్‌సీ మ‌ధ్య దీర్ఘ‌కాల భాగ‌స్వామ్యంలో ఓ స‌రికొత్త మైలురాయి. ఇప్పుడు రిల‌య‌న్స్ రిటైల్ భార‌త‌దేశంలో అన్ని చోట్లా గ్యాప్‌ బ్రాండుకు అధికార రీటైల‌ర్ అవుతుంది. ప్రముఖ సినీ నటి అనుపమా పరమేశ్వరన్ ఈ స్టోర్ ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

TS DOST Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

గ‌త సంవ‌త్స‌రం నుంచి 50కి పైగా గ్యాప్‌ స్టోర్స్ తెరిచారు. ముంబై ఇన్ఫినిటీ మాల్‌లో కొత్త ఫ్రీ స్టాండింగ్ గ్యాప్ స్టోర్ తెరిచారు. ఇప్పుడు హైద‌రాబాద్‌లోని శ‌ర‌త్ సిటీ క్యాపిట‌ల్ మాల్‌లో రెండో స్టోర్ తెర‌వ‌డం.. రెండోద‌శ ప్రారంభానికి సూచిక‌. ఇందులో భాగంగా రాబోయే నెల‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొన్ని ఫ్రీస్టాండింగ్ స్టోర్లు తెరుస్తారు. శ‌ర‌త్ సిటీ కేపిట‌ల్ మాల్‌లోని గ్యాప్‌స్టోర్‌లో డెనిమ్, లోగో ఉత్ప‌త్తులు, ఖాకీలు.. ఇంకా మ‌హిళ‌లు, పురుషులు, పిల్ల‌లు, శిశువుల‌కు కావ‌ల్సిన అన్ని ర‌కాల బ్రాండ్లు దొరుకుతాయి.

‘భార‌త‌దేశంలో మా ఉనికిని విస్త‌రించ‌డానికి రిల‌య‌న్స్ రిటైల్‌తో భాగ‌స్వామ్యం కుదిరినందుకు ఉద్విగ్నంగా ఉంది. ఈ ఫ్రీస్టాండింగ్ స్టోర్ల ప్రారంభంతోను, మ‌ల్టీ-బ్రాండ్ స్టోర్ల‌తోను భార‌తీయ క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత చేరువ‌వుతాం..’ అని గ్యాప్‌ ఐఎన్‌సీ అంత‌ర్జాతీయ, గ్లోబ‌ల్ లైసెన్సింగ్‌, హోల్‌సేల్ విభాగం మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆడ్రియెన్ గెర్నాండ్ అన్నారు.

గ్యాప్‌ స్టోర్‌ను ప్రారంభిస్తున్న సంద‌ర్భంగా రిల‌య‌న్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఫ్యాష‌న్‌, లైఫ్‌స్టైల్ విభాగం ప్రెసిడెంట్, సీఈవో అఖిలేష్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, ‘ఐకానిక్ బ్రాండ్ అయిన గ్యాప్‌ని కొత్త రూపంలో భార‌త‌దేశానికి తీసుకురావడం ఆనందంగా ఉంది. కొత్త గ్యాప్‌ స్టోర్లను సందర్శించినప్పుడు వినియోగదారులు సరికొత్త రిటైల్ గుర్తింపును కనుగొనడమే కాకుండా, స్మార్ట్ ట్రయల్ రూమ్స్, ఎక్స్‌ప్రెస్‌ చెక్-అవుట్, మంచి ధర విలువతో సహా సాంకేతిక-ఆధారిత షాపింగ్ అనుభవాన్ని పొందుతారు. భారతదేశంలో గ్యాప్‌ దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికకు ఫ్రీస్టాండింగ్ స్టోర్లను తెరవడం ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది భారతీయ వినియోగదారులకు ప్రపంచ స్థాయి బ్రాండ్లను, వైవిధ్యమైన షాపింగ్ అనుభవాన్ని తీసుకురావడానికి మాకు మరొక అవకాశాన్ని ఇస్తుంది’ అని చెప్పారు.

గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ఉన్న గ్యాప్‌ స్టోర్ సోమవారం నుంచి ఆదివారం వ‌ర‌కు రోజూ ఉదయం 11:00 నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. 

టాపిక్