Adilabad heatwaves: ఆదిలాబాద్ లో భానుడి భగ భగ... అల్లాడిపోతున్న ప్రజలు
19 April 2024, 13:24 IST
- Adilabad heatwaves: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. భానుడి భగభగతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జనం అల్లాడిపోతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఎండలకు అల్లాడిపోతున్న ప్రజలు
బెల్లంపల్లి రీజియన్ లోని బెల్లంపల్లి Bellampally, మందమర్రి Mandamarri, శ్రీరాంపూర్ Srirampur ఏరియాల్లో ఉన్న ఐదు ఓసీపీ OCPల్లో 20 రోజుల క్రితం 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తరువాత ఒక్కసారిగా పెరిగాయి.
ప్రస్తుతం రీజియన్లోని ఓసీపీల్లో సరాసరిగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదువుతోంది. దీంతో కార్మికులు పని చేయడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వేడిగాలులు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నారు. సాధారణ ప్రాంతాలతో పోల్చితే కోలైమైనింగ్ ఉన్న చోట ఉష్ణోగ్రత రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతుంది.
భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులకు డ్యూటీకి వచ్చి పోయేటప్పుడే తప్ప లోపలికి వెళ్లిన తరువాత ఏమాత్రం బయటి వాతావరణంతో సంబంధం ఉండదు. కానీ ఓసీపీల్లో కార్మికులంతా ఆరు బయట ఉండి పని చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వీరు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఉదయం 11 గంటలకే భానుడు ప్రతాపం చూపెడుతున్నాడని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.. ప్రతీ వేసవిలో కంపెనీ ఉపశమన చర్యలు చేపడుతుంది. ఈసారి ముందే ఎండలు మండుతున్నందున యాజమాన్యం వేసవి ఉపశమన చర్యలు మరిన్ని చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఎండల తీవ్రతకు కార్మికుల హాజరు శాతం కూడా పడిపోతుంది.
సాధారణం కంటే 4డిగ్రీలు అధికంగా :
ఉమ్మడిదల బజ్జీలలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.గత వారంలో నాలుగు డిగ్రీలు సెల్సియస్ అధికంగా నమోదుకోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ లో 45.2 డిగ్రీల గరిష్ట ఉషనోగ్రత నమోదైంది. ద్రోని ప్రభావం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా పడ్డాయి . మంచిర్యాల జిల్లాలో కొలబెల్ట్ ప్రాంతం నిప్పుకుండంలా మారాయి. మండల ప్రజలు ఇప్పటికీ ఇద్దరు వ్యక్తులు ఎండ దెబ్బ బారినపడి చనిపోయారు.
తగు జాగ్రత్తలు పాటించండి
జిల్లాలోని పలు 45 డిగ్రీల దాటిన ప్రాంతాల్లో వృద్ధులు, చిన్నారులు,రోగులకు ముప్పు పొంచి ఉందని జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా ఉన్నతాది కారులు సూచిస్తున్నారు.
ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతాలను అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ వడగాలు ముప్పునకు సంబంధించి ఆరేంజ్ హెచ్చరికలు జారీ చేసింది.పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులు ఈదురుగాలుళ్లతో కూడిన మోస్తార్ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
(రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రతినిధి)