TSRTC Lahari Bus: లహరిలో కుదుపులు లేని ప్రయాణం… నిర్మల్ డిపో నుంచి దూర ప్రాంతాలకు స్లీపర్ సర్వీస్ బస్సులు-tsrtc lahari sleeper service buses from adilabad nirmal depot ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tsrtc Lahari Sleeper Service Buses From Adilabad Nirmal Depot

TSRTC Lahari Bus: లహరిలో కుదుపులు లేని ప్రయాణం… నిర్మల్ డిపో నుంచి దూర ప్రాంతాలకు స్లీపర్ సర్వీస్ బస్సులు

HT Telugu Desk HT Telugu
Feb 29, 2024 09:45 AM IST

TSRTC Lahari Bus: ప్రయాణంలో సౌకర్యం కోరుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో టిఎస్‌ఆర్టీసీ లహరి సర్వీసుకు ఆదరణ పెరుగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్ Nirmal డిపో నుంచి పలు ప్రాంతాలకు ఈ సర్వీసులు నడుపుతున్నారు.

దూర ప్రాంత ప్రయాణాలకు వరంగా మారిన లహరి బస్సులు
దూర ప్రాంత ప్రయాణాలకు వరంగా మారిన లహరి బస్సులు

TSRTC Lahari Bus: దూర ప్రాంత ప్రయాణాల్లో సౌకర్యం కోరుకునే వారికి తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ లహరి సర్వీసులు వరంగా మారుతున్నాయి. సుఖ ప్రయాణాన్ని కోరుకునే వారు ఇప్పటి వరకు ప్రైవేట్ సర్వీసుల్ని ఆశ్రయిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

దూరప్రాంత ప్రయాణాలకు ఇన్నాళ్లు ప్రైవేటు సర్వీసులను ఆశ్రయించిన వారిని ఆకట్టుకునేందుకు ఆర్టీసి ప్రయత్నాలు చేస్తోంది. ప్రైవట్ సర్వీసుల్లో ఏసీ, నాస్ఏసీ విభాగాల్లో స్లీపర్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకు రావడంతో ఎక్కువ మంది వాటిని ఆశ్రయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ సైతం ఈ మార్పును అందిపు చ్చుకోవాలని, ప్రయాణికులకు మరింత మెరు గైన సేవలను అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పెద్దదైన డిపోగా పేరున్న నిర్మల్ కూడా ఇందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తుంది.

అధికారుల చొరవతో నిర్మల్‌ డిపోలో మొత్తం 10 ఆధునిక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. కుదుపులు లేని ప్రయాణం లహరి.. పేరిట తీసుకొచ్చిన ఈ స్లీపర్ కోచ్ బస్సులు ప్రయాణికులకు మరింత మెరుగైన అనుభూతినిస్తుంది.

2 ఏసీ, 8 నాన్ ఏసీ లహరి బస్సులు ఇప్పటికే నిర్మల్ డిపోకు చేరుకున్నాయి. ఏసీ బస్సులను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసులకు వినియోగిస్తున్నారు. నాన్ ఏసీ బస్సులను విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కనిగిరి, పామూరు, వింజమూరు, కందుకూరు ప్రాంతాలకు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.

నిర్మల్ ప్రాంతంలో ఆంధ్రా నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉంటారు. వీరిలో చాలా మంది ప్రయాణంలో సౌఖ్యం కోసం ప్రైవేటు స్లీపర్ కోచ్ బస్సు లను ఆశ్రయించే వారు. ఇప్పుడా అవసరం లేకుండా ఆర్టీసీనే ఆధునిక బస్సులను నడుపు తోంది.

ఆధునిక పరిజ్ఞానంతో తయారైన ఈ సర్వీసుల్లో ఎలాంటి కుదుపుల్లేకుండా ఆహ్లాదకర ప్రయాణం అనుభూతి చెందొచ్చు. ఈ బస్సుల్లో 47 సీట్లుంటాయి. ఇందులో 32 సీట్లు కూర్చొని ప్రయాణించేందుకు కాగా, మిగతావి పడుకునేందుకు బెర్తుల్లాగా ఉంటాయి. బస్సు ఎక్కడ ఆగిందో తెలిపేలా స్పీకర్ అనౌన్స్మెంట్ వస్తుంది. బస్సులో రివర్స్ కెమెరాతో పాటు లోపల కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.

సద్వినియోగం చేసుకోవాలి: ప్రతిమారెడ్డి, డిపో మేనేజరు

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మల్ డిపోకు ప్రజా దరణ ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు వివరిస్తున్నారు. అత్యాధునిక లహరి బస్సు సర్వీసులు సైతం 10 వచ్చాయి. వీటిని దూరప్రాంతాల ప్రయాణికుల సౌలభ్యం కోసం సిద్ధం చేశామని డిపో మేనేజర్ ప్రతిమా వివరించారు.

లహరి సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉందని ఎలాంటి సమాచారం కావాలన్నా 73828 42582 నంబరులో సంప్రదించొచ్చన్నారు. ఏసీ, నాన్ ఏసీ విభాగాల్లో ఈ బస్సులు కొనసాగుతున్నాయని తెలిపారు.బస్సుల్లో ప్రయాణికుల సౌలభ్యం కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేశామని, డ్రైవింగ్‌లో అనుభవం, నైపుణ్యం ఉన్నవారు బస్సులు నడుపుతుండటం వల్ల భద్రతపై మరింత భరోసా లభిస్తుందని చెబుతున్నారు.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ ఉమ్మడి ఆదిలాబాద్.

IPL_Entry_Point