Brutal Murder: మంచిర్యాలలో దారుణం.. నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య
Brutal Murder: మంచిర్యాలలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై యువకుడిని నరికి చంపారు. ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకుని వస్తున్న యువకుడిపై రాళ్లతో దాడి చేసి హతమార్చారు.
Brutal Murder: మంచిర్యాల జిల్లాలో దారుణహత్య జరిగింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ముష్కే రమేష్ అనే యువకుడిని ప్రత్యర్థులు నడిరోడ్డుపై హత్య చేశారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న రమేష్‌ను అడ్డగించిన ఓ కుటుంబం గొంతు కోసి, ఆ తర్వాత బండ రాళ్లతో తలపై మోది హతమార్చారు.
ఉదయం పది గంటల సమయంలో జరిగిన హత్యతో గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు. కళ్లెదుట హత్య జరగడంతో గ్రామస్తులు నివ్వెర పోయారు. ముష్కే రమేష్ గ్రామంలోని ఓ యువతి వ్యవహారంలో తలెత్తిన వివాదంతో హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కనకయ్యతో పాటు అతని కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు జైపూర్ పోలీసులు చెబుతున్నారు.
ఇందారం గ్రామానికి చెందిన రమేష్, గతంలో గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఉంది. ఇద్దరి మధ్య కొన్నాళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిచింది. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో యువతికి మరో వివాహం జరిపించారు. మహేహ్ వేధింపుల కారణంగా యువతి భర్త ఆత్మహత్య కు కూడా ప్రయత్నించాడని స్థానికులు చెబుతున్నారు.
యువతికి పెళ్లైన తర్వాత కూడా రమేష్ ఆమెను వేధిస్తున్నాడని యువతి కుటుంబం సభ్యులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. యువతి జోలికి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించినా రమేష్ తీరు మార్చుకోలేదు. యువతికి అసభ్యకరమైన మెసేజీలు పంపుతున్నాడని ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల పుట్టింటికి వచ్చిన యువతితో రమేష్ వేధింపులు తీవ్రం చేశాడు. ఈ ఘటనతో బాధితురాలి కుటుంబం రగిలిపోయింది. యువతి కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కలిసి మాటు వేసి రమేష్‌పై దాడి చేశారు. గ్రామంలోకి వస్తున్న మృతుడిని అడ్డగించి గొంతుకోశారు. తీవ్ర గాయాల పాలైన రమేష్‌ను ప్రాణాలతోో వదలకూడదనే ఉద్దేశంతో బండ రాళ్లలతో తలపై మోది పాశవికంగా హతమార్చారు. ఈ ఘటనను స్థానికులు వీడియోలలో చిత్రీకరించారు.
ఈ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రమేష్‌ను హత్య చేయడంతో అతని బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు హత్యకు పాల్పడిన నలుగురు నిందితులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. మరోవైపు మృతుడి కుటుంబం రమేష్ హత్యకు వేరే కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.