తెలుగు న్యూస్  /  Telangana  /  Peacefully Completed Khairatabad Ganesh Shobha Yatra In Hyderabad

Ganesh Shobha Yatra: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు

HT Telugu Desk HT Telugu

09 September 2022, 19:01 IST

    • ganesh immersion in hyderabad: ఖైరతాబాద్‌ మహా గణనాథుడి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు.
ముగిసిన ఖైరతాబాద్ గణేష్ శోభ యాత్ర,
ముగిసిన ఖైరతాబాద్ గణేష్ శోభ యాత్ర, (HT)

ముగిసిన ఖైరతాబాద్ గణేష్ శోభ యాత్ర,

khairatabad ganesh shobha yatra 2022: ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనం ముసింది. గౌరీ తనయుడు... గంగమ్మ ఒడికి చేరాడు. వివిధ రూపాల్లో మండపాల్లో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చిన కొండంత దేవుడు మళ్లీ వస్తానంటూ సెలవు తీసుకున్నాడు. 9 రోజులు పత్రి, గరిక పూజలు అందుకొని.. పండ్లు, పాయసం, ఉండ్రాళ్లు ఆరగించిన బొజ్జ గణపయ్య తల్లి ఒడికి చేరాడు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

Singareni Jobs : సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల షెడ్యూల్ లో మార్పు, కొత్త తేదీలివే!

ఇలా సాగింది…

ganesh immersion in hyderabad: ఖైరతాబాద్ శోభాయూత్ర అంగరంగ వైభవంగా జరిగింది. యువతీ యువకుల కోలాటాలు, నృత్యాలు, బ్యాండుమేళాలు, డప్పుచప్పుళ్ల సందడి మధ్య సాగింది. 67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగులు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మహాగణపతిని తరలించడానికి 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో 26 టైర్ల టస్కర్‌ వాహనాన్ని ఏర్పాటు చేశారు. 70 టన్నుల బరువుతో త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్‌ పంచముఖ మహాగణతి సెన్షెన్‌ థియేటర్‌, టెలిఫోన్‌ భవన్‌, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి చేరుకుంది. మొత్తం 2.5 కిలోమీటర్ల పొడవు సాగిన శోభాయాత్ర ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌ 4 వద్ద గణనాథుడికి పూజలు నిర్వహించారు. అనంతరం సాగర్ లో కి విడిచారు. ఈ సమయంలో ఆ ప్రాంతమంతా గణపతి బప్పా నినాదాలతో మార్మోగింది. ఈ యాత్ర 6 గంటలకు పైగా సాగింది.

మరోవైపు గణేష్ నిమజ్జనాల కోసం హుస్సే్న్ సాగర్ చుట్టూ 22 క్రేన్లు ఏర్పాటు చేశారు. భద్రత కోసం దాదాపు 3 వేల మంది పోలీసులు డ్యూటీలో ఉన్నారు. పర్యవేక్షణ కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 200 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగింపునకు 20 జేసీబీలు ఏర్పాటు చేశారు.

నిమజ్జనం కారణంగా శనివారం ఉదయం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. శోభాయాత్ర జరిగే మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు.