తెలుగు న్యూస్  /  Telangana  /  Munugode Bye Election Schedule Released By Election Commission Of India

Munugode Bye Election : మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల….నవంబర్‌ 3న పోలింగ్

B.S.Chandra HT Telugu

03 October 2022, 12:19 IST

    • Munugode Bye Election మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, బీహార్‌, హర్యానా, యూపీ, ఒడిశాలలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరుగనుంది.
మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం (HT_PRINT)

మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

Munugode Bye Election మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల దాఖలు చేయడానికి అక్టోబర్ 14 చివరి తేదీగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు అక్టోబర్‌ 15వ తేదీని గడువుగా ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet District : సరిగ్గా చూసుకొని కొడుకు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

TS Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

షెడ్యూల్‌ విడుదలకు ముందే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించేశాయి. కోమటిరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ తరపున బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్‌ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేయనున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న తెలంగాణ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక కీలకమని అన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీకి వామపక్షాలు మద్దతు ప్రకటించాయి.

మునుగోడు ఉపఎన్నికలకు అక్టోబర్‌ 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలు చేయడానికి అక్టోబర్ 14 చివరి తేదీగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు అక్టోబర్‌ 15వ తేదీని గడువుగా ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్‌ 17వరకు గడువు ఇచ్చారు. మునుగోడులో ఉప ఎన్నిక నవంబర్‌ 3వ తేదీన జరుగనుంది. ఓట్ల లెక్కింపును నవంబర్ 6వ తేదీన చేపడతారు. నవంబర్ 8వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను ముగిస్తారు.

మునుగోడుతో పాటు మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్‌, బీహార్‌లోని మోకమా, గోపాల్‌గంజ్‌, హర్యానాలోని అదంపూర్‌, యూపీలోని గోల గోకర్‌నాథ్‌, ఒడిశాలోని ధర్మసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరుగనుంది. 2022 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. వివిపాట్‌ ఈవిఎలలోనే ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.