తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Winter Season In Telangana 2022 : నవంబర్ 3 నుంచి పెరగనున్న చలి

Winter Season In Telangana 2022 : నవంబర్ 3 నుంచి పెరగనున్న చలి

HT Telugu Desk HT Telugu

20 October 2022, 11:05 IST

google News
    • IMD Weather Alert : నైరుతి రుతుపవనాలు తెలంగాణ నుంచి ఈ వారాంతానికి తిరోగమనం అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్‌లో ప్రారంభమైన నాలుగు నెలల ప్రయాణం ముగియవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

వర్షాకాలం(Rain Season) ముగియడంతో రాష్ట్ర రాజధాని త్వరలో చలి పెరిగే అవకాశం ఉంది. నవంబర్ ప్రారంభంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ(IMD) అధికారులు భావిస్తున్నారు. మూడు రోజుల తర్వాత హైదరాబాద్‌(Hyderabad)తో సహా రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకోనున్నాయి. శనివారం వరకు నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. శీతాకాలం(Winter) నవంబర్ 3 నుండి మెుదలవుతుందని అంచనా వేశారు అధికారులు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం, నగరంలో సాధారణంగా నవంబర్ నుండి జనవరి వరకు చలి ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6.7 డిగ్రీల సెల్సియస్ జనవరి 2015లో మారేడ్‌పల్లిలో నమోదైంది. ప్రధానంగా రాష్ట్రంలోని ఉత్తర మరియు ఈశాన్య జిల్లాల్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయి. దక్షిణ మరియు ఆగ్నేయ జిల్లాలు కాస్త సీజన్‌లో వెచ్చగా ఉంటాయని.. అని వాతావరణ శాఖ ఒక నివేదికలో పేర్కొంది.

రుతుపవనాల తిరోగమనం.. రాష్ట్ర రాజధానిలో సాధారణ తేదీ అక్టోబర్ 15గా ఉంది. అయితే, బుధవారం వరకు, హైదరాబాద్‌లో తీవ్రమైన వర్షం కురిసింది. నెల ప్రారంభం నుంచి అక్టోబరు 19 వరకు హైదరాబాద్‌(Hyderabad)లో సాధారణ వర్షపాతం 84.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కుత్బుల్లాపూర్, కాప్రా వంటి ప్రాంతాల్లో ఇప్పటివరకు అధిక వర్షపాతం నమోదయ్యాయి. TSDPS డేటా ప్రకారం, రాజేంద్రనగర్(Rajendranagar), ఇతర ప్రాంతాలలో వరుసగా అధిక వర్షపాతం కనిపించింది. రుతుపవనాలు(Monsoon) ప్రారంభమైనప్పటి నుండి సాధారణ వర్షపాతం నమోదైన ఏకైక ప్రాంతం ముషీరాబాద్.

హైదరాబాద్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి-హైదరాబాద్(IMD Hyderabad) అంచనా వేసింది. సెరిలింగంపల్లి, మూసాపేట్, చార్మినార్, హయత్‌నగర్, గాజులరామారం వంటి ప్రాంతాల్లో తేలికపాటి (2.50 మి.మీ నుండి 15.50 మి.మీ) వర్షం కురిసే అవకాశం ఉంది. ఖైరతాబాద్(Khairatabad), సికింద్రాబాద్, అంబర్‌పేట్, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, యూసుఫ్‌గూడ, జుబ్లీగూడ, జూబిలీగూడలోనూ వర్షం పడే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం