Lip Care in Winter : చలికాలంలో పెదాలు పగులుతున్నాయా? ఇలా కాపాడుకోండి..
Lip Care in Winter : చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చర్మం డ్రై అయిపోతుంది. అలాగే పెదవులు కూడా చాలా డ్రై అయిపోయి.. పగిలిపోతాయి. చూసేందుకు నిర్జీవంగా కనిపిస్తాయి. అయితే చలికాలంలో పెదవులకు ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
Lip Care in Winter : తేమ, చలితో కూడిన వాతావరణం ఫలితంగా.. మన చర్మం పనితీరు ప్రభావితమవుతుంది. ఇది ట్రాన్సెపిడెర్మల్ వాటర్ లాస్ (TEWL) పెరుగుదలకు దారితీస్తుంది. అంటే పొడి చర్మానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఈ ప్రభావానికి లోనయ్యేవి పెదవులు. పెదవులు చాలా సున్నితంగా ఉండి.. త్వరగా డ్రై అయిపోయి.. పగుళ్లు ఏర్పడి అందవిహీనంగా మారిపోతాయి. మరి చలికాలంలో వీటిపై ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో.. పెదవులు నిగనిగలాడేలా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
DIY తేనెతో చేసుకోగలిగే లిప్ స్క్రబ్స్
తేనె మీ పెదాలను తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. పగిలిన పెదవులు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చేస్తుంది. అదనంగా ఇది మీ పెదవుల నుంచి పొడి, చనిపోయిన చర్మాన్ని తొలగించగల తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేస్తుంది.
కాబట్టి.. రోజంతా మీ పెదాలకు సేంద్రీయ తేనెను రాసేందుకు ప్రయత్నిచండి. వేళ్లతో లేదా కాటన్‌తో మీరు దీనిని అప్లై చేయవచ్చు. అయితే ఇంట్లోనే పెదవులకు తేనెతోనే మరిన్ని సంరక్షణ చర్యలు ఎలా తీసుకోవాలో ఇప్పుడు చుద్దాం.
తేనె-బాదం స్క్రబ్
పెదవి స్క్రబ్స్‌తో సహా దాదాపు అన్ని స్క్రబ్‌లలో తేనె హ్యూమెక్టెంట్‌గా ఉంటుంది. అయితే ఇంట్లోనే తయారుచేసుకునే లిప్ స్క్రబ్ కోసం.. తేనే, చక్కెర, బాదం నూనెను కలపండి.
కావాల్సిన పదార్థాలు
* చక్కెర - 2 స్పూన్లు
* తేనె - 1 స్పూన్
* బాదం నూనె - 1 స్పూన్
వీటిని ఓ గిన్నెలో తీసుకుని బాగా కలపండి. ప్రతిరోజూ రెండుసార్లు పెదవులపై అప్లై చేయండి. గాలి చొరబడని కంటైనర్‌లో దీనిని నిల్వ చేసుకోవచ్చు.
తేనె-కొబ్బరి స్క్రబ్
కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, తేనెను కలిపి ఈ స్క్రబ్ చేస్తారు. ఇది మీ పెదవులకు స్క్రబ్ మాదిరిగానే కాకుండా.. మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది.
కావాల్సినవి
* తేనె - 1 టేబుల్ స్పూన్
* కొబ్బరి నూనె - 1 టేబుల్ స్పూన్
* చక్కెర - ¼ కప్ (మెత్తగా గ్రైండ్ చేయాలి)
* ఆలివ్ ఆయిల్ - 1 టీ స్పూన్
ఒక గిన్నెలో తేనె, కొబ్బరి నూనె, చక్కెర, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. దీనిని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసుకుని రోజు వాడొచ్చు. దీనివల్ల లిప్స్ మాయిశ్చరైజ్ అవుతాయి.
బ్రౌన్ షుగర్-తేనె స్క్రబ్
ఆలివ్ ఆయిల్, తేనెతో తయారు చేసుకునే హ్యూమెక్టెంట్స్, ఈ లిప్ స్క్రబ్ మీ పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. వాటిని మృదువుగా ఉంచుతుంది.
కావాల్సిన పదార్థాలు
* బ్రౌన్ షుగర్ - 1 టీస్పూన్
* వైట్ షుగర్ - 1 టీస్పూన్
* తేనె - 1 టీస్పూన్
* ఆలివ్ ఆయిల్ - ½ టీస్పూన్
వీటన్నింటిని ఓ గిన్నెలో తీసుకుని బాగా కలపండి. అది పేస్ట్ లాగా తయారవుతుంది. ప్రతి రోజు దీనిని పెదవులపై అప్లై చేయండి. గాలి రాని కంటైనర్‌లో నిల్వ చేసుకుని వాడుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్