Lip Care : స్మోకింగ్ వల్ల పెదవులు నల్లగా మారితే.. ఇవి ఫాలో అయిపోండి..-beauty tips here s how smokers can protect their lips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Beauty Tips Here's How Smokers Can Protect Their Lips

Lip Care : స్మోకింగ్ వల్ల పెదవులు నల్లగా మారితే.. ఇవి ఫాలో అయిపోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 17, 2022 03:06 PM IST

ఫ్రెండ్స్ వల్లనో, లేక పార్టీలలోనో, సరదా కోసమో, ఒత్తిడి వల్లనో చాలా మంది ఆడా, మగా తేడా లేకుండా సిగరెట్లను కాల్చేస్తున్నారు. సిగరెట్స్ కాల్చడం వల్ల చాలా ఆరోగ్య నష్టాలు ఉన్నాయి. కానీ టీనేజర్స్​కి మాత్రం ప్రధాన సమస్య లిప్స్ నలుపుగా మారిపోవడమే. సిగరెట్ కాలుస్తున్నప్పుడు హాయిగా ఉండొచ్చేమో కానీ.. తాగినాక లిప్స్ నల్లగా మారిపోతాయి. నల్లగా ఉండే లిప్స్​ మీకు కాస్త అసౌకర్యాన్ని ఇస్తాయి. అలా ఇబ్బంది పడకూడదు అంటే వీటిని ఫాలో అయిపోండి.

పొగత్రాగటం పెదవులకు కూడా హానికరమే..
పొగత్రాగటం పెదవులకు కూడా హానికరమే..

Lip Care : మాట్లాడే సమయంలో, చుంబించే సమయంలో చాలామంది చూపు పెదవులపైనే ఉంటుంది. మరి అలాంటి పెదవులు మీకున్న చెడు అలవాట్ల వల్ల నల్లగా మారిపోతే చాలా.. బాగోదు. చాలా మందికి సిగరెట్​ కాల్చడం ఓ అలవాటుగా మారిపోయింది. కానీ సిగరెట్ కాల్చడం వల్ల కాలక్రమేణా పెదవులు నల్లగా, నిర్జీవంగా మారిపోతాయి. సిగరెట్‌లో ఉండే నికోటిన్.. కాలక్రమేణా పెదవులకు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేస్తుంది. సిగరెట్ పొగ నుంచి వెలువడే వేడి శరీరంలోని మెలనిన్‌ను విడుదల చేయడానికి ప్రేరేపిస్తుంది. దీని వలన నోటి చుట్టూ ఉన్న ప్రాంతం నల్లగా మారిపోతుందని స్కిన్ సెల్స్ వ్యవస్థాపకుడు శివమ్ చక్రాల వెల్లడించారు. అయితే మృదువైన, ఆరోగ్యకరమైన, పోషకమైన పెదాలను పొందడానికి జీవనశైలిలో కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు. ఆ చిట్కాలు ఏంటో మీరు తెలుసుకుని ఫాలో అయిపోండి.

లిప్స్ తేమగా ఉంచుకోవాలి..

పెదవులు తేమగా ఉంచుకోవడం చాలా అవసరం. పెదవులు డ్రైగా ఉంటే మరింత నల్లగా మారే అవకాశముంటుంది. కాబట్టి పెదవులు తేమగా ఉండడం చాలా ముఖ్యం. దీనికోసం లిప్​ బామ్​లు, వెన్న, లిప్ సీరమ్​లు.. ఎక్కువకాలం పెదవులు తేమగా ఉండేలా చేస్తాయి. అనామ్లజనకాలు, సిరమైడ్‌లతో సమృద్ధిగా ఉన్న లిప్ సీరమ్‌లు.. ప్రభావవంతతంగా పనిచేస్తాయి. దెబ్బతిన్న పెదవులను ఇవి పునరుద్ధరిస్తాయి. 

ఎక్స్​ఫోలియేషన్ అవసరం..

పెదవులు నల్లబడడాన్ని తగ్గించడానికి ఎక్స్‌ఫోలియేషన్ చాలా కీలకం. ఆ ప్రాంతాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి మీకు చాలా సున్నితమైన, రాపిడి లేని పెదవి స్క్రబ్స్ అవసరం. AHA ఆధారిత లిప్ స్క్రబ్ ధూమపానం చేసే పెదవులపై సున్నితంగా, ప్రభావవంతంగా పనిచేస్తుంది. గ్రాన్యులేటెడ్ స్క్రబ్‌లు పెదవుల మధ్య రాపిడిని సృష్టిస్తాయి. ఇవి పెదవులు మరింత నల్లబడేలా చేస్తాయి.

యూవీ కిరణాల నుంచి రక్షణ

UV కిరణాలు మీ పెదవుల రంగును ప్రభావితం చేస్తాయి. సూర్యరశ్మికి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల సోలార్ కెలిటిస్ ఏర్పడవచ్చు. తద్వార పెదవులు పొడిగా, పగుళ్లను ఏర్పరుస్తాయి. హానికరమైన యూవీ కిరణాలు నుంచి రక్షించుకోవడానికి కనిష్ట SPF 15-30 ఉన్న లిప్ బామ్‌ని ఉపయోగించాలి. 

ప్రతిరోజు పెదవులకు మంచి లిప్ సీరమ్ లేదా హైడ్రెంట్స్, యాంటీఆక్సిడెంట్‌లతో నిండిన లిప్ బామ్‌ని అప్లై చేయండి. ఇలా రోజు చేస్తుండడం వల్ల మీ లిప్స్ కలర్ ఆటోమేటిక్​గా నార్మల్ రంగుకు మారిపోతాయి. 

ధూమపానం వల్ల నోటికి వివిధ రకాల వైరస్‌లు సంక్రమించే ప్రమాదం ఉంది. ధూమపానం చేసేవారు తరచూ ఇన్‌ఫెక్షన్‌లకు, ముఖ్యంగా ఫ్లూ, న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లకు ఎక్కువగా గురవుతారు. క్షయవ్యాధి, గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు.. మధుమేహం కూడా వచ్చే అవకాశముంది. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది. అందుకే ధూమపానాన్ని మానేయడమే మంచిది. లేదంటే సమస్యలు తప్పవు. 

WhatsApp channel

సంబంధిత కథనం