Europe heat wave : చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో అత్యధిక 'ఉష్ణోగ్రతలు'-europe braces for highest temperatures amid widespread wildfires ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Europe Braces For Highest Temperatures Amid Widespread Wildfires

Europe heat wave : చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో అత్యధిక 'ఉష్ణోగ్రతలు'

Sharath Chitturi HT Telugu
Jul 18, 2022 04:24 PM IST

Europe heat wave : అధిక ఉష్ణోగ్రతలో యూరోప్​ అల్లాడిపోతోంది. సోమవారం పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు భయపడిపోతున్నారు.

అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉత్తర స్పెయిన్​లో మొదలైన కార్చిచ్చు
అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉత్తర స్పెయిన్​లో మొదలైన కార్చిచ్చు (AP)

Europe heat wave : యూరోప్​ను 'హీట్​వేవ్​' గడగడలాడిస్తోంది. కనివిని ఎరుగని రీతిలో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తాజా పరిణామాల మధ్య.. బ్రిటన్​- ఫ్రాన్స్​ దేశాలకు హై అలర్ట్​ జారీ అయ్యాయి. సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయా దేశాల వాతావరణశాఖలు హెచ్చరించాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

హీట్​వేవ్​ కారణంగా యూరోప్​వ్యాప్తంగా అటవీ ప్రాంతాలు దగ్ధమవుతున్నాయి. కార్చిచ్చులు ఎక్కడికక్కడ వ్యాపిస్తున్నాయి. పోర్చుగల్​, గ్రీస్​, స్పెయిన్​, ఫ్రాన్స్​తో పాటు నైరుతి యూరోప్​లో వేలాది హెక్టార్ల అటవీ భూమి మంటల్లో చిక్కుకుంది. దీనితో వేలాది మంది ప్రజలు సైతం ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.

ఫ్రాన్స్​..

యూరోప్​ హీట్​వేవ్​ నేపథ్యంలో ఫ్రాన్స్​లో హై అలర్ట్​ కొనసాగుతోంది. నైరుతు అక్విటైన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 42డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. బ్రిట్టని, గిరోండే ప్రాంతంలో 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

యూరోప్​ హీట్​వేవ్​తో ఏర్పడిన కార్చిచుల కారణంగా ఫ్రాన్స్​వ్యాప్తంగా ఇప్పటివరకు 16వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. కార్చిచ్చులను అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. మరింత సిబ్బందిని పంపించేందుకు ఆయా యంత్రాంగాలు కసరత్తులు చేస్తున్నాయి.

బ్రిటన్​..

UK heatwave temperature : బ్రిటన్​లో సైతం పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. యూరోప్​ హీట్​వేవ్​ నేపథ్యంలో.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్రిటన్​లో రెడ్​ అలర్ట్​ జారీ చేశారు. ప్రజల జీవితాలను ప్రమాదం ఉందని హెచ్చరించారు. దక్షిణ ఇంగ్లాండ్​లో సోమ- మంగళ వారాల్లో 40డిగ్రీలో ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని అక్కడి వాతావరణశాఖ అంచనా వేసింది. ఇదే నిజమైతే.. ఆ ప్రాంతం చరిత్రలో ప్రజలు కనివిని ఎరుగుని రీతిలో అత్యధిక ఉష్ణోగ్రతలను చూసినట్టు అవుతుంది.

ఇప్పటికే బ్రిటన్​వ్యాప్తంగా అనేక స్కూళ్లు మూతపడ్డాయి. ముందు నుంచి హెచ్చరికలు ఉన్నప్పటికీ.. హీట్​వేవ్​ను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ప్రజలు.. అవసరం ఉంటేనే బయటకు రావాలని ప్రభుత్వం సూచించింది. మెట్రో రైళ్లు కూడా రోజులాగా కాకుండా.. నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి. ఫలితంగా ప్రయాణాల సమయం పెరుగుతోంది.

స్పెయిన్​..

యూరోప్​ హీట్​వేవ్​ నేపథ్యంలో స్పెయిన్​లో కార్చిచ్చు ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వాటిని అదుపు చేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోసాసియో ప్రాంతంలో కార్చిచ్చును అదుపుచేసే క్రమంలో ఆదివారం.. అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇది కాకుండా.. కార్చిచ్చులు.. ఇప్పటికే అనేకమంది పౌరులను పొట్టనపెట్టుకుంది.

Spain heatwave : ఇప్పటికీ.. స్పెయిన్​లోని వివిధ ప్రాంతాల్లో 20కిపైగా అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే 4,500 హెక్టార్ల భూమి అగ్నికి ఆహుతైపోయింది.

పోర్చుగల్​..

పోర్చుగల్​లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినా.. కార్చిచ్చు ఘటనలు భయపెడుతూనే ఉన్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా అలర్ట్​ జారీ అయ్యింది.

యూరోప్​ హీట్​వేవ్​ నేపథ్యంలో పోర్చుగల్​లో.. గత వారంలో రికార్డు స్థాయిలో 47డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేరువేరు ఘటనల్లో ఇద్దరు మరణించారు. కార్చిచ్చుల కారణంగా 60మంది గాయపడ్డారు. 12,000-15,000 హెక్టార్ల అటవీ భూమీ దగ్ధమైంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం