తెలుగు న్యూస్  /  Telangana  /  Mla Jagga Reddy Sensational Comments On Revanth Reddy

MLA Jagga Reddy : అవసరమైతే పార్టీ పెడతా.. మరోసారి రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్

HT Telugu Desk HT Telugu

28 November 2022, 19:33 IST

    • Jagga Reddy Comments : టీపీసీసీ పదవి నుంచి రేవంత్ రెడ్డిని దించేసే ఆలోచన ఎవరికీ లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ.. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి జాగీరు కాదని చెప్పారు.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఎమ్మెల్యే జగ్గారెడ్డి(MLA Jaggareddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబితే.. తాను ఎందుకు మాట్లాడుతానని పేర్కొన్నారు. టీపీసీసీ(TPCC) పదవి నుంచి రేవంత్ రెడ్డిని దించేసి ఆ కుర్చీలో కూర్చోవాలనే ఆలోచన ఎవరికీ లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి.. ఎవరితోనూ చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. రేవంత్ ను తామేమీ ఇబ్బంది పెట్టడం లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

Arunachalam Tour : ఈ నెలలో 'అరుణాచలం' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? రూ. 7500కే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

TS Model School Results : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల - ఈ డైరెక్ట్ లింక్ తో ర్యాంక్ చెక్ చేసుకోండి

TS Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు - ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, IMD తాజా అప్డేట్స్ ఇవే

'రేవంత్ రెడ్డికి పీసీసీ(PCC) ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. బండి సంజయ్(Bandi Sanjay)కి ఉన్న రాజకీయ తెలివి రేవంత్ కు లేదు. సొంత పార్టీ నేతలను బద్నాం చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల(Elections) ముందు అడ్డమైన పంచాయతీలు పెట్టుకున్నారు. నేను ఏ పార్టీలోకి వెళ్లను. అవసరమైతే పార్టీ పెడతాను.' అని జగ్గారెడ్డి అన్నారు.

వచ్చే ఎన్నికలు రేవంత్ రెడ్డి(Revanth Reddy) హయాంలోనే జరుగుతాయని జగ్గారెడ్డి చెప్పారు. తాను ఏం మాట్లాడినా.. వివాదం అవుతుందన్నారు. ఈ బురదంతా తనకు ఎందుకు అని వ్యాఖ్యానించారు. తనకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం అలవాటు అని పేర్కొన్నారు. ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు.. ఆయనను దింపేయాలని రేవంత్ రెడ్డి అభిమాన సంఘాలు లెటర్లు రాయలేదా అని అడిగారు.

'వచ్చే ఎన్నికలు రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలోనే నడిపిద్దాం. నువ్వు సహకరిస్తలేవు అంటే రేవంత్ ఫెయిల్ అయినట్లే కదా? కాంగ్రెస్ పార్టీ(Congress Party) రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి జాగీరు కాదు. కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటేనే మంచిది. చాలా నిర్ణయాలు కూడా.. సమావేశాల్లో చెప్పడం లేదు. పీఏసీ సమావేశాలకు అందరూ వచ్చారు. ఉత్తమ్ చెబితే నేను ఎందుకు మాట్లాడుతా.' అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

అసమ్మతి కాంగ్రెస్‌(Congress)లో సహజంగానే ఉంటుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లో ఇది ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి సమష్టి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని అన్నారు. మల్లారెడ్డి ఐటీ దాడులపై(Malla Reddy IT Raids) జగ్గారెడ్డి స్పందించారు. 8 ఏళ్ల నుంచి ఐడీ దాడులు చేయలేదని, టీడీపీ(TDP)లో ఉన్నప్పుడే ఆస్తులు సంపాదించారని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు.